రీ ఎంట్రీ తర్వాత పవన్ వరుస సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఏకంగా అరడజను సినిమాలను లైన్లో పెట్టారు పవర్ స్టార్(pawan kalyan). కానీ వాటిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇక మిగతా సినిమాల పరిస్థితి డైలమాలో ఉన్నాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లు(hari hara veera mallu) అదిగో, ఇదిగో అనడమే తప్పా.. అసలు ఏ మాత్రం ముందుకు కదలడం లేదు. ఈ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనుకుంటున్న దర్శకుడు క్రిష్‌కు.. ప్రతిసారి ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి.
భీమ్లా నాయక్‌తో పాటు షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా.. డిలే అవుతునే ఉంది. అందుకు కారణం పవన్ రాజకీయంగా బిజీ అవడమే అని చెప్పొచ్చు. అయినా పవన్ ఈ సినిమాను కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు. పైగా పవన్ బస్సు యాత్ర కూడా ఆగిపోవడంతో.. ఇక హరిహర వీరమల్లుకు గుమ్మడి కాయ కొట్టేయడం ఖాయమనుకున్నారు. అందుగు తగ్గట్టే ఇటీవల వర్క్‌షాప్‌లో కూడా పాల్గొన్నారు పవన్. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పవర్ స్టార్‌ను తిరిగి షూటింగ్‌కు రప్పించేలా లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్ షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. అక్టోబర్ లాస్ట్ వీక్‌లో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవడానికి రెడీ అవుతున్నారట పవన్. ఇక ఆ తర్వాత ‘వినోదయ సీతమ్’ రీమేక్‌ను కంప్లీట్ చేయనున్నారట. అయితే హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ గురించి మాత్రం ఎలాంటి అప్టేట్ లేదు. మరి ఈసారైనా హరిహర వీరమల్లు షూటింగ్ రీస్టార్ట్ అవుతుందేమో చూడాలి.