»Varun Tej Lavanya Tripathi Wedding Invitation Is Here
Varun- Lavanyaల పెళ్లి కార్డు చూశారా..? రిసెప్షన్ ఎప్పుడు, ఎక్కడ అంటే.?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నవంబర్ 1వ తేదీన ఇటలీలో పెళ్లి జరగనుండగా.. 5వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
Varun Tej Lavanya Tripathi Wedding Invitation Is Here
Varun Tej-Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ (Varun Tej)- లావణ్య త్రిపాఠి (Lavanya) పెళ్లి బాజాలు మోగనున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో గల టుస్కానీలో జరగనుంది. నవంబర్ 1వ తేదీన కొందరు బంధు, మిత్రుల మధ్య పెళ్లి జరగనుంది. 5వ తేదీన హైదరాబాద్‌లో గల ఎన్ కన్వెన్షన్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
వరుణ్- లావణ్య వెడ్డింగ్ కార్డ్‌లో వీ, ఎల్ అక్షరాలను కార్డు పై భాగంలో డిజైన్ చేశారు. ఆ కార్డ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వెడ్డింగ్ కార్డ్ గిప్ట్ బాక్స్ మాదిరిగా ఉంది. ఓపెన్ చేయగానే లోపల నానమ్మ- తాతయ్య పేర్లు ఉన్నాయి. కింద పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్, సోదరుడు రామ్ చరణ్ తేజ పేర్లు ఉన్నాయి. 5వ తేదీన ఎన్ కన్వెన్షన్‌లో రాత్రి 7 గంటలకు రిసెప్షన్ జరగనుంది. అలాగే వెడ్డింగ్ కార్డ్‌లోనే కార్ పాస్ ఇచ్చారు. కార్డ్ తీసుకొని.. కార్ పాస్ ఉన్న వారే రిసెప్షన్‌కు వచ్చే అవకాశం ఉంటుంది.
The grand reception awaits in Hyderabad at N-Concetion, Madhapur, on November 5th, where industry celebrities will join in the festivities!💍 pic.twitter.com/b3z1FV9umF
వరుణ్-లావణ్య ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. దాంతో జూన్ 9వ తేదీన నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో పెళ్లితో ఇద్దరు ఒక్కటి అవబోతున్నారు.