కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ తర్వాత వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా ఇదే. దాంతో విజయ్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇదే అనుకున్నారు. కానీ ఇది తమిళ్ సినిమాగానే రూపొందుతోంది. తమిళంలో ‘వారిసు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీని సంక్రాంతి బరిలో నిలిపేందుకు రెడీ అవుతున్నాడు దిల్ రాజు. ఈ క్రమంలో రీసెంట్గా ఈ సినిమా నుంచి రంజితమే అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. తమన్ ట్యూన్ చేసిన ఈ పాట.. ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 40 మిలియన్స్‌కు పైగా వ్యూస్.. 1.7 మిలియన్లకు పైగా లైక్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది. దాంతో త్వరలోనే సెకండ్ సాంగ్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ పాడడడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రాండ్‌గా ఆడియో ఫంక్షన్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 24న చెన్నైలో ఈ ఆడియో ఈవెంట్ ఉంటుందని టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు. దాంతో వరిసు ఆల్బమ్ పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ లాంటి సీనియర్స్ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి వారసుడు ఆల్బబ్ ఎలా ఉంటుందో చూడాలి.