మొన్నటి వరకు రీమేక్ సినిమాలతో మెగా అభిమానులను డిసప్పాయింట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. నెక్స్ట్ మాత్రం అలా జరగకుండా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మెగా 156ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
ఈసారి మెగాస్టార్ దెబ్బకు బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోతాయ్ అని..సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi). బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠతో మెగా 156 ప్రాజెక్ట్‌ను సోషియో ఫాంటసీగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది మెగా 156. కీరవాణి మ్యూజిక్ వర్క్‌తో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయింది. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే. కాబట్టి ఈ సినిమాకు విజవల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు మెగాస్టార్. పంచభూతాలను కలుపుతూ.. మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని, అందుకే.. టైటిల్ ముల్లోక వీరుడు అని ప్రచారంలో ఉంది.
అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్టు ముందు నుంచి టాక్ ఉంది. అందులో ఇద్దరు సీనియర్ బ్యూటీలు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం స్వీటీ అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2024 ఎండింగ్ లేదా.. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి మెగా 156 ఎలా ఉంటుందో చూడాలి.