బిగ్ బాస్ తెలుగు 7లో మొదటి పురుష కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లోని అన్ని ఎలిమినేషన్లలో మహిళా కంటెస్టెంట్లు మాత్రమే ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం మొదటి మగ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో సందీప్, శోభలకు ఈ వారంలో తక్కువ ఓట్లు వచ్చాయని..వారిలో సందీప్ ఎలిమినేట్ అయినట్లు లీక్ అయ్యింది.
బిగ్ బాస్ సీజన్ 7(bigg boss 7 telugu) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గత సీజన్లతో పోలిక లేకుండా, భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉల్టా, పల్టా అంటూ తీసుకువచ్చి, ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గేమ్ షోలో భాగంగా ప్రతివారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. అయితే, ఈ సీజన్ లో మొదటి నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. షోని హిట్ చేయడానికి అందమైన అమ్మాయిలను చాలా మందిని తీసుకువస్తున్నప్పటికీ, వారు వచ్చినవారు వచ్చినట్లే ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. రతిక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది అనుకోండి అది వేరే విషయం.
అయితే ఈ వారం తొలిసారి ఓ మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. ఈ వారం సందీప్, శోభలకు ఈ వారంలో తక్కువ ఓట్లు వచ్చాయట. అందరికంటే, సందీప్ కి తక్కువ ఓట్లు రావడంతో ఆయన ఎలిమినేట్ అయ్యారని సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. నిజానికి శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఆమె ప్రవర్తన కూడా చిరాకుగా ఉండటంతో, ఆమె ఎలిమినేట్ కావాలని ప్రేక్షకులు కూడా ఎక్కువగా కోరుకున్నారు. అయితే, సందీప్(aata sandeep) ఎలిమినేట్ అయ్యారని సమాచారం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఆటా సందీప్, పోటీదారు మొదటి వారం నుంచి 8వ వారం వరకు నామినేషన్లలోకి ప్రవేశించలేదు. ఇప్పటివరకు నామినేట్ అవ్వకుండానే రికార్డు సృష్టించాడు. బిగ్ బాస్ చరిత్రలో ఏ కంటెస్టెంట్ ఈ పని చేయలేకపోయాడు. సందీప్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే ఆయన నామినేషన్స్‌లో లేకపోవడంతో ఆయన ఓటు బ్యాంకులో ఎలాంటి వృద్ధి కనిపించకపోవడంతో తొలిసారి నామినేషన్లో అడుగుపెట్టడంతో ఎలిమినేట్ అయినట్లు సమాచారం. బిగ్ బాస్ ఎలిమినేషన్ గడువు తేదీ కంటే ముందే రివీల్ కావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు సందీప్ ఎలిమినేషన్ కూడా లీక్ అయింది. ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు 7లో తొలి పురుష కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరగడంపై ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.