Jonita Gandhi: ఇప్పటికీ నేను అభద్రతా భావంతోనే ఉన్నా
బాలీవుడ్ స్టార్ సింగర్ జోనితా గాంధీ అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. తాను పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా తన గురించి కీలక విషయాన్ని ఒకటి బయటపెట్టింది. ఇన్ని హిట్లు సాధించినా ఇప్పటికీ భయపడుతూనే ఉంటుందటా. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Jonita Gandhi: స్టార్ సింగర్ జోనితా గాంధీ(Jonita Gandhi) కేవలం బాలీవుడ్(Bollywood)లో మాత్రమే కాదు. అనేక భాషల్లో పాడి మంచి పేరు సంపాదించుకుంది. తాను హిందీ చలనచిత్ర సంగీత రంగంలో అడుగుపెట్టి ఈ ఏడాదితో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంల ఇండస్ట్రీ తనకు చాలా నేర్పించిందని జోనితా పేర్కొన్నారు. ఓపికగా ఉండడం, మనం ఎంచుకున్న మార్గానికి కట్టుబడి ఉండడం లాంటి అనేక జీవిత సత్యాలను పరిశ్రమలో నేర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ సంవత్సరం జోనితా ప్రోఫెషినల్ లైఫ్‌లో ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే తాను పాడినా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రంలో వాట్ జుమ్కా సాంగ్ 16 భాషల్లో విడుదలైంది. అయినా కానీ జోనితాకు ఇంకా భయం, అభద్రతా భావం మాత్రం అలాగే ఉంటుందటా.
2013లో విడుదలైన షారుక్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని టైటిల్ ట్రాక్ ద్వారా బాలీవుడ్‌లోకి ఈ భామ ఎంటర్ అయింది. హిందీ, తమిళ, పంజాబీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో చాలా పాటలు ఆలపించింది. వాటిలో ది బ్రేకప్ సాంగ్, మెంటల్ మనదిల్, చెల్లామా, అరబిక్ కుతు వంటి ఎన్నో పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
తాజాగా వాట్ జుమ్కా సాంగ్ హిందీలోనే దాదాపు 180 మిలియన్ల మంది వీక్షించారు. ఇంత సక్సెస్‌లో ఉన్నప్పటికీ ఇంకా అవకాశాల కోసం భయపడుతూనే ఉంటానని ఈ అమ్మడు అంటోంది. ఇది కఠినమైన పరిశ్రమ, పోటీ చాలా ఎక్కువ అని, కళాకారులకు ఎప్పుడు సక్సెస్‌లు మాత్రమే ఉండవని, మంచిరోజులతో పాటు చెడురోజులు కూడా ఉంటాయని చెబుతోంది. ఇక పరిశ్రలో ఎలా ఉండాలో, ఎవరి దగ్గర ఏమి తీసుకోకూడదని త్వరగానే అర్థం చేసుకున్నానని చెప్పింది.
ప్రతి రోజు సాధన చేస్తానని, శరీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నిస్తానని చెబుతోంది. ఈ మధ్యే రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో తన 34వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ని విజయవంతమైన పాటలు పాడుతున్నారు కదా ఎప్పుడైనా భయపడ్డారా అని కొందరు అడిగారు. దానికి సమాధానం ఇస్తూ.. తన శ్రోతలను సంతృప్తపరచడం కోసం మంచి ప్రాజెక్ట్‌లను చేపట్టడం విషయంలో అప్రమత్తంగా ఉంటానని చెప్పుకొచ్చారు. మన పనే మాట్లాడుతుందిగా అని ఊరుకోలేము. పరిశ్రమలో తోటి కళాకారులతో స్నేహపూర్వకంగా ఉండాలి. అదే విధంగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండాలి. అభిమానులను అలరిస్తూ ఉండాలని అన్నారు. సంగీతం పట్ల ఆసక్తిని కలిగి ఉండటానికి ఫాలోవర్స్‌తో యాక్టివ్‌గా ఉండటం వారితో కనెక్ట్ కావడం చాలా ముఖ్యమని జోనితా గాంధీ అన్నారు. చాలా మంది ఒకటి రెండు విజయాలకే కాళ్లు నేలమీద పెట్టని విధంగా చేస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఇన్ని సక్సెస్‌లు సాధించిన జోనితా వైఖరి ఎందరికో స్పూర్తిదాయకమని నెటిజన్లు అంటున్నారు.