Sharukh Khan: 19 రోజుల్లో వెయ్యి కోట్లు.. షారుఖ్ సంచలనం!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా వెయ్యి కోట్లు రాబట్టి చరిత్ర సృష్టిచింది. సెప్టెంబర్ 7న రిలీజ్ అయినా జవాన్ సినిమాతో.. కేవలం 19 రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపించాడు షారుఖ్.
షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్గా, ప్రియమణి, సంజయ్ దత్, యోగి బాబు, దీపికా పదుకునే కీలక పాత్రల్లో నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అయింది. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా డే వన్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అనిరుద్ రవి చందర్ సంగీతం అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 650 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. తాజాగా 1000 కోట్ల క్లబ్లో చేరింది. కేవలం 19 రోజుల్లోనే ‘జవాన్’ 1000 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఈ ఏడాది ఆరంభంలో పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్.. ఇప్పుడు జవాన్‌తో అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. దీంతో ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా షారుఖ్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. అలాగే ఈ సినిమాతో 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి తమిళ దర్శకుడిగా అట్లీ అరుదైన ఘనత సాధించాడు. ఇక హిందీలో ఇప్పటి వరకూ 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మాసివ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ముంబైలో ఆయన ఇంటిముందు క్యూ కడుతున్నారు అభిమానులు. ఈ సినిమా తర్వాత ఇదే ఏడాదిలో రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో చేస్తున్న ‘డంకీ’ సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. క్రిస్మస్ టార్గెట్‌గా డిసెంబర్లో డంకీ రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా వెయ్యి కోట్లు రాబడితే.. షారుఖ్ మరో కొత్త చరిత్ర సృష్టించినట్టే.