ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ మాత్రమే తమ మాసివ్ దాహం తీర్చే సినిమా అని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. కెజియఫ్‌లో ప్రశాంత్ నీల్ హీరో ఎలివేషన్.. హై ఓల్టేజ్ ఫైట్స్ చూసి.. సలార్‌ను నెక్ట్స్ లెవల్లో ఊహించుకుంటున్నారు. ఇప్పటి వరకు లీక్ అయినా.. రిలీజ్ అయిన పోస్టర్స్.. సలార్ మాసివ్ ట్రీట్ ఇవ్వడం ఖామయమంటున్నాయి. అందుకే సలార్ అప్టేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన ఓ సాలిడ్ అప్టేట్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. సలార్ మూవీని కెజియఫ్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఈ సంస్థ నిర్మాణంలో కన్నడ నుంచి వచ్చిన ‘కాంతార’ అనే సినిమా భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉండడంతో.. సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ‘కాంతార’ క్లైమాక్స్ చూసి ఫుల్లుగా ఎంజాయ్ చెసినట్టు తెలిపారు హోంబలే మేకర్స్. ఇప్పటికీ కాంతార క్లైమాక్స్ ఆలోచిస్తే.. గూస్బంప్స్ తెప్పిస్తుందని అన్నారు. దాంతో ‘సలార్‌లో ఎపిక్ క్లైమాక్స్ బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఉంటుందని’ సాలిడ్ అప్డేట్ రివీల్ చేసారు మేకర్స్. ఈ లెక్కన సలార్ క్లైమాక్స్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సలార్ క్లైమాక్స్ అప్టేట్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. మరి అంచనాలను పెంచేస్తున్న సలార్.. ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.