మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుస ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆలయాల దర్శనం వెనక బ్రో మూవీ ప్రమోషన్ ఉందా లేక ప్రాణ భయంతో అలా పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారా? అనే ప్రశ్న నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు కారణంగా ఈ మధ్య ఆ మెగా హీరో చేసిన కామెంట్సే కారణం.
మెగా ఫ్యామిలీలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(Saidharam Tej) ఇటీవలె ‘విరూపాక్ష’తో భారీ హిట్ కొట్టాడు. తన కెరియర్లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు సాధించిన సినిమా అది. తాజాగా ఆయన బ్రో సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..తనకు పవన్ గురువులాంటి వాడని, ఆయనతో యాక్టింగ్ చేయడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు తెలిపాడు. మెగాస్టార్‌తో కూడా త్వరలోనే నటిస్తానని చెప్పారు.
గత కొన్ని రోజులుగా సాయి ధరమ్ తేజ్(Saidharam Tej) పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. కొందరేమో బ్రో మూవీ కోసమే దేవుళ్లను దర్శిస్తున్నారని అంటుంటే మరికొందరు ప్రాణ భయంతో అలా గుళ్లూగోపురాలు తిరుగుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు. ఆ మధ్య సాయిధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం జరిగాక సుమారు 12 రోజుల పాటు ఆయన కోమాలోనే ఉన్నారు. ఆ ప్రమాదం జరిగిన సమయంలోనే ఆయనకు ప్రాణ భయం వెంటాడింది. కొందరేమో ఏకంగా సాయిధరమ్ తేజ్ ప్రాణాలు పోయాయని రూమర్స్ క్రియేట్ చేశారు. అయితే దేవుని దయ వల్ల ఆయన ఆ ప్రమాదం నుంచి కోలుకుని ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు.
కాకపోతే సాయిధరమ్ తేజ్(Saidharam Tej) రాబోయే రోజుల్లో ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి తాజాగా ఈ హీరో ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. బ్రో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మూవీ టీమ్ ఇటీవలె ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తోంది. అందులో సాయిధరమ్ తేజ్ తన బాడీలో వచ్చిన మార్పుల గురించి అసలు విషయాలు తెలిపాడు. యాక్సిడెంట్ వల్ల ఫిజికల్ ఫిట్నెస్ కోల్పోయారా? అని యాంకర్ ప్రశ్నించగా దానికి సమాధానం ఇచ్చారు. తన ఫిట్నెస్ తగ్గడం నిజమేనని, యాక్సిడెంట్ వల్ల మెడికేషన్‌లో భాగంగా కొన్ని స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చిందని, వాటి వల్ల చాలా బరువు తగ్గిపోయినట్లు తెలిపారు. తాను 12 రోజులు కోమాలో ఉన్నానని, అప్పుడు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల తన బరువు 71 కిలోలకు తగ్గిపోయినట్లు వెల్లడించారు.
అంతకుముందు తనకున్న వెయిట్‌తో పోలిస్తే చాలా తగ్గిపోయానని, ఆ తర్వాత స్టెరాయిడ్స్ ఆపడంతో ఆటోమేటిక్‌గా బరువు పెరిగిపోయినట్లు తెలిపారు. పైగా వర్కవుట్ చేయడానికి టైమ్ లేకపోవడమే కాకుండా వెయిట్స్ లేపడానికి కూడా బాడీ ఫిట్‌గా లేదని, ఇప్పుడు బరువు తగ్గడంతో పాటు ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సాయిధరమ్ తేజ్(Saidharam Tej) కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. త్వరలోనే ఆయన సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడని, ఆయనకు ప్రాణ భయం ఉండటం వల్లే తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకున్నట్లు చెప్పుకుంటున్నారు. తాజాగా నేడు ఆయన శ్రీకాకుళంలోని అరసవల్లిలో సూర్యభగవాణుడి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. మొత్తానికి ఈ రూమర్ నిజమేనా? కాదా? అనే చర్చ నెట్టింట వైరల్ అవుతోంది.