ఏపీలో రాజకీయాలు మంచి కాక మీద ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మరింత హీట్ గా మారాయి. ఈ నేపథ్యంలో, డైరెక్టర్ బోయపాటి మరింత హీట్ పెంచుతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం స్కంద. మొదటి నుంచి బాలకృష్ణకి వీరాభిమాని అయిన బోయపాటి, సాధ్యమైనంత వరకు తన సినిమాల్లో పొలిటికల్ పంచులు వేస్తూ ఉంటాడు. ఎప్పుడూ బాలయ్యతో పంచ్‌లు వేయించే బోయపాటి ఈ సారి స్కంద మూవీలో రామ్ తో వేయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పాలక పక్షంపైనా ఈ ద్వయం తమదైన శైలి డైలాగులతో కాక పుట్టిస్తారని గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఓ పాత్ర ఓ ఫేమస్ ప్రత్యర్ధి పొలిటిషయన్ ని గుర్తు చేసేలా ఉంటుందట. ఆ పాత్ర డైలాగులు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారుతాయని అంటున్నారు. అవి ఒక్కసారిగా అర్ధం కానప్పటికీ స్లో పాయిజన్ లా జనాల్లోకి వెళ్తాయని గుస గుస వినిపిస్తోంది. ఏపీలో తాజా పరిస్థితుల నేపథ్యంతో ఈ ఇద్దరు కూడా లో లోపల చాలా సీరియస్ గానే ఉన్నారని..తమవైపు నుంచి సంఘీభావాన్ని తమ సినిమా ద్వారా తెలిజయజేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏపీలో ‘స్కంద’ ఎలాంటా ప్రకంపనలు రేపుతుందో చూడాలి.