బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ నటించిన తాజా చిత్రం బుట్ కట్ బాలరాజు నుంచి మేకర్స్ టీజర్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అమ్మాయిలు నువ్వనుకుంత మంచివాళ్లు కాదురా అనే డైలాగ్ ఆసక్తి రేపుతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫేమ్ సోహెల్ తాజాగా యాక్ట్ చేసిన బుట్ కట్ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. ఈ వీడియో చూస్తే పక్కా వీలేజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా అనిపిస్తుంది. జబర్దస్త్ రాంప్రసాద్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. టీజర్ వీడియో ఆధారంగా హీరో సోహెల్ ఈ సినిమాలో ఖాళీగా తిరిగే తిండిబోతు ఆ తర్వాత ఏం చేశాడనే ఆసక్తి రేపుతోంది. ఆ క్రమంలోనే హీరో ఏలా మారాడు? అతని ప్రేమలో హీరోయిన్ ఎలా పడిపోయింది? ఆ క్రమంలో అతని ఫ్రెండ్స్ అమ్మాయిలు నువ్వు అనుకున్నంత మంచోళ్లు కాదారా వారిని నమ్మోద్దనే డైలాగ్స్ ఈ చిత్రంలో ఏ జరుగుతోందనే ఆసక్తి నెలకొంది.
వీలేజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం శ్రీకోనేటి చేయగా..గ్లోబల్ ఫిల్మ్స్, లక్కీ మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మాత ఎండీ పాషా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా..DOPగా శ్యామ్ కె నాయుడు వ్యవహరించారు. ఇక నటీనటుల విషయానికి వస్తే సయ్యద్ సోహెల్ ర్యాన్, మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్, సద్దాం, ‘కొత్త బంగారు లోకం’ వివేక్ సహా తదితరులు యాక్ట్ చేశారు.
సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. సోహెల్ 1991 ఏప్రిల్ 18న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించారు. గతంలో మిస్టర్ ప్రెగ్నెంట్ (2023), లక్కీ లక్ష్మణ్ (2022), యురేకా (2020) సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు.