»Jailer Movie Comedian Redin Kingsley And Married Tv Actor Sangeetha
Redin Kingsley: ఓ ఇంటి వాడైన జైలర్ సినిమా నటుడు
తమిళ నటుడు రెడిన్ కింగ్స్లీ పెళ్లి చేసుకున్నారు. అతని ప్రియురాలు, టీవీ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. మైసూరులో కొద్దిమంది అతిథులు, బంధువుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది.
Redin Kingsley: తమిళ నటుడు రెడిన్ కింగ్స్లీ పెళ్లి చేసుకున్నారు. అతని ప్రియురాలు, టీవీ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. మైసూరులో కొద్దిమంది అతిథులు, బంధువుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కామెడీని పండించడంలో రెడిన్ శైలి భిన్నంగా ఉంటుంది.
అమాయకంగా కనిపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. ఆయన వాయిస్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. నయనతార నటించిన ‘కోలమావు కోకిల’తో రెడిన్ కమెడియన్గా తన కెరీర్ను ప్రారంభించాడు. శివ కార్తికేయన్ నటించిన ‘డాక్టర్’లో తన నటనకు గానూ ఉత్తమ హాస్యనటుడిగా ‘సైమా’ అవార్డును గెలుచుకున్నాడు. విజయ్ ‘మృగం’, విజయ్ సేతుపతి ‘కతువాకుల బివ కాడల్’ తదితర చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ ‘జైలర్’తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలన్నీ తెలుగులోనూ విడుదల కావడంతో రెడిన్ ఇక్కడ కూడా పాపులర్ అయ్యారు.