Ishvarya married: కమెడియన్ కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి!
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు కమెడియన్ కొడుకును పెళ్లి చేసుకుంది. అయితే.. ఈ పెళ్లి సైలెంట్‌గానే జరిగింది. కానీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ అర్జున్ కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంది.
Ishvarya married: హీరో అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాక్షన్ కింగ్‌గా తెలుగులో మంచి పాపులరిటీ సొంతం చేసుకున్నాడు అర్జున్. ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చాడు. ఒకే ఒక్కడు లాంటి ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తున్నాడు. తమిళ్, తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్‌గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక అర్జున్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నాడు. వారిలో ఐశ్వర్య సర్జా హీరోయిన్గా కొన్ని సినిమాలు కూడా చేసింది. కానీ అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే.. చాలా కాలంగా కమెడియన్ తంబీ రామయ్య కుమారుడు ఉమాపతితో ప్రేమలో ఉంది ఐశ్వర్య. ఉమాపతి కూడా హీరోగా రాణిస్తున్నాడు.
వీరి ప్రేమను ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఓకె చెప్పడంతో.. గత ఏడాది అక్టోబర్‌లో ఐశ్వర్య, ఉమాపతి ఎంగేజ్ మెంట్ జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ జూన్ 10న చెన్నైలోనీ అంజని సుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో ఐశ్వర్య, ఉమాపతి పెళ్లి వైభవంగా జరిగింది. జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమవగా.. జూన్ 8 సంగీత్ కార్యక్రమం జరిగింది. ఇక.. ఇరు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో జూన్ 10న ఘనంగా వివాహ మహోత్సవం జరిగింది. దీంతో.. జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్‌లో రిసెప్షన్ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం ఊశ్వర్య, ఉమాపతి పెళ్లి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.