»Another Heroine Who Got Married Is Meetha Raghunath
Meetha Raghunath: పెళ్లి చేసుకున్న మరో హీరోయిన్
తాజాగా మరో హీరోయిన్ వివాహబంధలోకి అడుగుపెట్టింది. పరిశ్రమలో వరుసగా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇటీవల్ గుడ్‌నైట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీతా రఘునాథ్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Another heroine who got married is Meetha Raghunath
Meetha Raghunath: మూవీ ఇండస్ట్రిలో ఈ సంవత్సరం హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్ల బాటపట్టారు. గత రెండు మూడు నెలలుగా పెళ్లి బాజాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, నటాషా దోషి, కృతికర్భందా, వరుసలో తాజాగా మీతా రఘునాథ్ చేరింది. గుడ్‌నైట్ (Goodnight) చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని, గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ భామ మీతా. ఆమె తన పార్టనర్‌తో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానికి నా హృదయం అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే తన హస్బెండ్ గురించి పెద్దగా విషయాలేవి చెప్పలేదు.
మీతా రఘునాథ్ 2022లో వచ్చిన ముదల్ నీ, ముడివుమ్ నీ అనే సినిమా ద్వారా పరిచయం అయింది. ఆ తరువాత గుడ్ నైట్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రొమాంటిక్ కామెడీగా రూపొందించిన ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గుడ్‌నైట్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె జె.ఎఫ్.డబ్ల్యూ మూవీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక కొత్త పెళ్లి చేసుకున్న ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన భర్త పేరేంటి? వివాహం ఎప్పుడు జరిగింది? అనే విషయాలను వెల్లడించలేదు. ఊటీలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం.