»Rumors Viral On Niharika Konidela Chaitanya Jonnalagadda Marriage Life
Mega Familyలో మరో జంట విడాకులు? నిజమేనా ఇది?
కాగా చైతన్య, నిహారిక ఇద్దరు కలిసి సినీ పరిశ్రమలో నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకున్నారు. వివాహమైన వెంటనే చైతన్యను హీరోగా పరిచయం చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే అతడిని సినీ పరిశ్రమకు పరిచయం చేయడానికి సహకరించలేదని.. ఈ విషయంలో గొడవలకు దారి తీశాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబం (Mega Family)లో కాపురాలు సక్రమంగా నిలబడటం లేదు. చిరంజీవి సోదరుడు, చెల్లెలు మొదలుకుని అతడి కూతుళ్ల వరకు ఇదే జరుగుతోంది. తాజాగా నాగబాబు (Konidela NagaBabu) ఇంట్లో కూడా ఇలాంటిదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. వీరి ఇంట ఓ పెళ్లి (Marriage) పెటాకులు అవుతోందని తెలుస్తున్నది. నాగబాబు కుమార్తె నిహారిక (Niharika Konidela) కాపురంలో చిచ్చు మొదలైనట్టు సమాచారం. ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న కాపురం కలహాలు వారి వ్యక్తిగత సోషల్ మీడియా (Social Media) వరకు చేరింది. ఒకరికొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో (UnFollow) కావడం.. పెళ్లి ఫొటోలు (Marriage Photos) డిలీట్ చేసుకోవడం వంటి వాటితో ఈ వార్త పుకారు కాదు వాస్తవమని తెలుస్తున్నది.
నాగబాబు ఒక్కగానొక్క కూతురు నిహారిక. మెగా కుటుంబంలోనే అల్లరి పిల్లగా గుర్తింపు పొందిన నిహారిక అంటే ఇంటిల్లిపాదిగా యమ ఇష్టం. ఉన్న ఒక చెల్లెలు కావడంతో వరుణ్ తేజ్ (Varun Tej), రామ్ చరణ్ (Ram Charan) అల్లారుముద్దుగా చూసుకుంటారు. ఈ క్రమంలోనే నిహారికను చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda)కు ఇచ్చి 2020 డిసెంబర్ 9న రాజస్థాన్ (Rajastan)లోని ఉదయ్ పూర్ (Udiapur)లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ లో అంగరంగ వైభవంగా వివాహం చేశారు. కొన్నాళ్లు సవ్యంగా ఉన్న వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయని ఏడాదిన్నర తర్వాత వార్తలు బయటకు వచ్చాయి.
కలహాల కాపురం
ఈ క్రమంలోనే చైతన్య పెట్టిన ఓ పోస్టు నిహారికకు నచ్చలేదని తెలిసింది. అనంతరం దీని మధ్య గొడవలు మొదలయ్యాయి. అనంతరం వారి ప్లాట్ విషయంలో కూడా వివాదం జరిగింది. వెంటనే వేరే ఇంటికి మారారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకరినొకరు ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకున్నారు. అక్కడి వరకు ఓకే కానీ ఇద్దరూ తమ పెళ్లి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య గొడవలు ముదిరాయని తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరూ దూరంగా ఉన్నారని సమాచారం. నిహారిక పెళ్లి తర్వాత కూడా మారలేదని, అల్లరి చేష్టలతో చైతన్య ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తెలుస్తున్నది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య విబేధాలు మొదలై ఇప్పుడు విడాకుల (Divorce) దాకా చేరిందని టాక్ వినిపిస్తోంది.
కాగా చైతన్య, నిహారిక ఇద్దరు కలిసి సినీ పరిశ్రమలో నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకున్నారు. వివాహమైన వెంటనే చైతన్యను హీరోగా పరిచయం చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే మెగా కుటుంబం అతడిని సినీ పరిశ్రమకు పరిచయం చేయడానికి సహకరించలేదని.. ఈ విషయంలో కూడా నిహారిక, చైతన్య మధ్య గొడవలకు దారి తీశాయి. ఇవన్నీ కలిపి మొత్తానికి నిహారిక, చైతన్య విడిపోయే పరిస్థితికి దారి తీశాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని మెగా కుటుంబం వర్గాలు పేర్కొంటున్నాయి. వీటిపైన ఎవరో ఒకరు వచ్చి బహిరంగంగా చెబితేనే ఈ పుకార్లకు విరామం పడుతుంది.