ఏపీ రాజకీయాలపై సినిమా తీస్తానని ఆర్జీవీ(rgv) ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కలిసిన తర్వాతే ఆర్జీవీ ఈ ప్రకటన చేశారు. కాగా.. తాజాగా టీడీపీ నేతలపై ఆర్జీవీ సెటైర్లు వేస్తూ… ఓ ఆడియో విడుదల చేశారు. తాను సినిమా తీస్తానంటే టీడీపీ బ్యాచ్ అంతా ఎందుకు హైరానా పడుటం నాకు అర్ధం కావడం లేదని అన్నారు.
పట్టాభి(pattabhi) ముద్దుగా బొద్దుగా రసగుల్లా లాగా వుంటాడని అన్నారు. ఒరేయ్ రసగుల్లా… నేను జగన్ గారిని కలిసానా??..ఎందుకు కలిశాను ఏమి తెలియకుండా ఎలా మాట్లాడతావు అని ప్రశ్నించారు. నేను బాడ్ డైరెక్టర్, బాడ్ సినిమా తీస్తానని నువ్వు అనుకున్నప్పుడు హ్యాపీగా వుండాలి కానీ టెన్షన్ ఎందుకు ఫీలవుతావు, ఎందుకమ్మా అని ప్రశ్నించారు.
నువ్వు అంత హైరానా పడితే నికు షుగర్ బిపి వచ్చి చస్తావ్ అని హెచ్చరించారు. రసగుల్లా రసగుల్లాలా వుండాలి కానీ మిరపకాయ లాగా వుండకూడదని అన్నారు. నీ మీద కోపం లేదు గానీ జాలి కలుగుతుందని RGV అన్నారు.
నేను ఒక మనిషి పేరు కానీ సబ్జెక్ట్ ఏమిటి అని కానీ చెప్పనప్పుడు నీకు నువ్వే ఊహించుకొని నువ్వు భయపడి పోయి మీ పార్టీ వాళ్ళను భయ పెడుతున్నావని పట్టాభిని విమర్శించారు. నేను మీకు సలహా ఇచ్చే అవసరం లేదని కూడా రాంగోపాల్ వర్మ అన్నారు.
నాకు స్వీట్స్ అంటే ఇష్టం నువ్వు నాకు నచ్చావు అని పట్టాభిని ఉద్దేశిస్తూ అన్నారు. రసగుల్లా తరువాత నీ అంత ముద్దుగా బొద్దుగా వున్న పదార్థాన్ని నేను చూడలేదని రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు. ఇలా పేలతా వుంటే బిపి వచ్చి హార్ట్ ఎటాక్‌తో చస్తావని హెచ్చరించారు. నీ అవసరం ఎవరికీ లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళకి వుందని అనుకుంటున్నానని ఆర్జీవీ అన్నారు. రసగుల్లా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా అంటూ చురకలంటించారు.