Ravi Tejaకు సెన్సార్ షాక్.. A సర్టిఫికెట్ బొమ్మ అట!
Ravi Teja : ధమకా, వాల్తేరు వీరయ్య తర్వాత.. మాస్ రాజా హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు రవితేజ చేసిన సినిమాలతో పోల్చుకుంటే.. రావణాసుర సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండబోతున్నట్టే కనిపిస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా తనలోని నెగెటివ్ షేడ్స్ చూపించబోతున్నాడు.
ధమకా, వాల్తేరు వీరయ్య తర్వాత.. మాస్ రాజా హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు రవితేజ చేసిన సినిమాలతో పోల్చుకుంటే.. రావణాసుర సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండబోతున్నట్టే కనిపిస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా తనలోని నెగెటివ్ షేడ్స్ చూపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌తో రావణాసుర అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు సుధీర్ వర్మ. ‘మర్డర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్.. రెస్పెక్ట్ మై ఆర్ట్ బేబీ’ అంటూ రచ్చ చేశాడు రవితేజ. ఈ సినిమా పై ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు మాస్ రాజా. ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 7న రావణాసుర గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ మాత్రం కాస్త షాక్ ఇచ్చేలానే ఉంది. తాజాగా రావణాసుర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సర్టిఫికేట్ ఇచ్చారంటే.. వైలెన్స్ అన్న ఎక్కువగా ఉండాలి, బోల్డ్ కంటెంట్ అయినా ఎక్కువై ఉండాలి. ట్రైలర్ ప్రకారం చూస్తే.. వైలెన్స్ సన్నివేశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ హీరోయిన్లు కూడా ఐదుగురు ఉన్నారు కాబట్టి.. గ్లామర్ డోస్ అయిన్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మొత్తంగా గ్లామర్ టచ్ ఇచ్చేలా.. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాబట్టి.. ‘ఏ’ సర్టిఫికేట్ అదుకుందని అంటున్నారు. ఇందులో రవితేజనే విలన్ కాబట్టి.. యాక్షన్ సీక్వెన్స్ పీక్స్‌లో ఉంబోతున్నట్టు.. సెన్సార్ సర్టిఫికేట్ చెబుతోంది. ఈ లెక్కన రవితేజ ఏదో ఇంట్రెస్టింగ్ స్టోరీతో రాబోతున్నాడనే చెప్పాలి. మరి రావణాసుర ఎలా ఉంటుందో చూడాలి.