గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా.. ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుందట. ఇదే విషయాన్ని అడుగుతూ హరీష్ క్వాలిటీ లేదని అడిగిన నెటిజన్.. సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు హరీష్ శంకర్.
పవర్ స్టార్‌ని ఎలా చూపించాలో కాదు.. అంతకు మించి అనేలా చూపించి బాక్సాఫీస్ బద్దలు చేశాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సినిమా వచ్చి దశాబ్ద కాలం దాటినా.. పవన్ ఫ్యాన్స్ ఆ సినిమాను అంత ఈజీగా మరిచిపోలేరు. ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తే.. రీ రిలీజ్ రికార్డులు లేస్తాయ్. అందుకే గబ్బర్ సింగ్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో పవర్ హౌజ్‌ని చూపించేశాడు హరీష్ శంకర్. ఇలాంటి సినిమా పైనే కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
లేటెస్ట్గా ఓ నెటిజన్.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ యాభై శాతం పూర్తయిందట కదా అన్నా.. ఇంక క్వాలిటీ.. ఆ దేవుడి మీదే భారం వేశాం.. అంటూ హరీష్ శంకర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. దానికి సాలిడ్ రిప్లే ఇచ్చాడు హరీష్ శంకర్. మామూలుగానే హరీష్ శంకర్ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటాడు. అలాంటిది నెగెటివ్ కామెంట్ చూస్తే ఊరుకుంటాడా? అందుకే.. సదరు నెటిజన్‌కు దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు. ‘అంతే కదా తమ్ముడు అంతకుమించి నువ్వేం చేయగలవు.. చెప్పు? ఈ లోగా కాస్త కెరీర్, జాబ్, స్టడీస్ మీద కూడా ఫోకస్ పెట్టు. వాటిని మాత్రం దేవుడికే వదిలేయకు. ఆల్ ది బెస్ట్’ అంటూ నెటిజన్ ట్వీట్ రిప్లై ఇచ్చాడు.
అయినా ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ చూశాక కూడా.. ఇలాంటి డౌట్స్ ఎందుకు? సినిమా లేట్ అవుతుందేమో కానీ.. క్వాలిటీ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్, హరీష్ శంకర్ అస్సలు కాంప్రమైజ్ అవ్వరని కామెంట్స్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ సినిమాకు తేరీ రీమేక్ అనే రిమార్క్ తప్పితే.. హరీష్ శంకర్ మేకింగ్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ను తక్కువ అంచనా వేయకూడదనే చెప్పాలి. అయినా కూడా అప్పుడే ఉస్తాద్ యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుందా?