»Vijay Antony Then The Father Now The Daughter Is That The Reason For Meeras Suicide
Vijay Antony: అప్పుడు తండ్రి, ఇప్పుడు కూతురు..’మీరా’ ఆత్మహత్యకు కారణం అదేనా?
బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి గల కారణాలేంటనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మీరా ఫోన్ సాయంతో కీలక విషయాలను తెలుసుకున్నారు.
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) కూతురు మీరా (Meera) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నేడు ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. బిచ్చగాడు (Bichagadu Movie) సినిమాతో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అటు మ్యూజిక్ డైరెక్టర్గా, ఇటు హీరోగా సినిమాలు చేస్తూ విజయాలను అందుకున్నాడు. తాజాగా తన కూతురి మరణంతో ఆయన కుటుంబం విషాదంలో నిండిపోయింది. మీరా ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకోవడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు.
గతంలో ఆత్మహత్యల గురించి విజయ్ ఆంటోని మాట్లాడిన వీడియో:
#VijayAntony lost his father to suicide when he was just 7 years old 🥹💔 Tragically, today, his own daughter has also taken her life 😭 In a video, #VijayAntony talks about the pain of life, why he’s silent & why suicide should never be an option 😓 https://t.co/GbjD4eJ8E0
మీరా ఆత్మహత్యకు కొందరు డిప్రెషన్ కారణమని అంటుంటే మరికొందరు మాత్రం ఆమె మరణం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మీరా ఆత్మహత్యపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మీరా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణలో వేగం పెంచారు. ఆ ఫోన్ ద్వారా పోలీసులకు కీలక విషయాలు తెలిశాయని సమాచారం. మీరా చనిపోవడానికి ముందుగా ఆమె మానసిక వైద్యుల అపాయింట్మెంట్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
The Force behind my strength,the consolations to my tears,the reason for my stress(Naughtiness super loaded)my Thangakatti-chellakutty. Meera Vijay Antony ,Congrats Baby 🤗❤️🥰🔥🔥🔥 pic.twitter.com/yfTTdIiAjL
— Fatima Meera Vijay Antony (@mrsvijayantony) March 12, 2023
ఈ నెల 24, 29వ తేదీల్లో మీరా అపాయింట్మెంట్ తీసుకుందని, కానీ ఈలోపే ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆమె మానసిక ఒత్తిడికి గల కారణం తల్లిదండ్రులకు తెలుసా? లేదా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. కూతురి మరణంతో విజయ్ ఆంటోని కుంగిపోయారని, ప్రస్తుతం ఆయన్ని విచారించలేమని పోలీసులు తెలిపారు.
విజయ్ ఆంటోనీకి 7 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు కుమార్తె కూడా అదేవిధంగా చనిపోయింది. గతంలో తన తండ్రిని తలచుకుని విజయ్ ఆంటోని ప్రజలకు ఓ సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా ఆత్మహత్య చేసుకోకూడదని, తన తండ్రి చనిపోయినప్పుడు తనకు 7 ఏళ్లని, తన చెల్లికి 5 ఏళ్లని తెలిపారు. తనని తన చెల్లిని పెంచేందుకు వారి అమ్మ ఎంతో కష్టపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
మీరా ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ ఆంటోని కన్నీటిపర్యంతమయ్యారు. మీరా మరణించడంతో సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శింబు, ఉదయనిధి స్టాలిన్, ఖుష్బు సుందర్, రితికా సింగ్, విమల్ వంటివారు, ఇతర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మీరా పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. మీరా సూసైడ్ కేసును సీరియస్గా తీసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి మీడియాకు సమాచారం అందిస్తామని చెన్నై పోలీసులు తెలిపారు.
స్పందించిన స్కూల్ టీచర్:
మీరా ఆత్మహత్యపై స్కూల్ టీచర్ స్పందిచారు. అంత్యక్రియల వేళ టీచర్లు, విద్యార్థులు మీరాకు సంతాపం తెలిపారు. చదువు విషయంలో మీరాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తమ పాఠశాలలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి ఉండదన్నారు. అయితే మీరా లావుగా ఉన్నాననే ఫీలింగ్తో ఉండేదని, ఇతర పిల్లలను చూసి ఆత్మనూన్యతాభావంతో బాధపడేదని టీచర్లు తెలిపారు. ఆమె మరణం వెనుక అసలు కారణాలు దర్యాప్తులో తెలుస్తాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.