ప్రస్తుతం చిరు, బాలయ్య ఫ్యాన్స్ హంగామా ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. థియేటర్లో మాస్ జాతరను తలపించేలా గోల గోల చేస్తున్నారు అభిమానులు. కార్ల ర్యాలీలు, బైక్ ర్యాలీలతో సినిమాకు వెళ్తు.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోను మెగా, నందమూరి అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో.. ఫ్యాన్స్‌కు నిజంగానే పూనకాలు వస్తున్నాయి. అది చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అంతేకాదు ఓ డైరెక్టర్ పై మండి పడుతున్నారు. అతనెవరో కాదు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఆదిపురుష్ ముందుగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో.. సినిమా పై నెగెటివిటీ ఎక్కువైపోయింది. దాంతో సినిమాను సంక్రాతి నుంచి జూన్‌కి పోస్ట్‌పోన్ చేశారు.
అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈపాటికి ఆదిపురుష్ థియేటర్లో సందడి చేసి ఉండేది. చిరు, బాలయ్య ఫ్యాన్స్‌కు మించి ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా ఉండేది. కానీ అలా జరగలేదు. రెండేళ్లు ఊరించి ఊరించి.. టీజర్‌తో డిసప్పాయింట్ చేశాడు ఓం రౌత్. లేదంటే.. సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలకు మించి ఆదిపురుష్ హవా నడిచేదని.. బాధపడిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంతేకాదు.. ముందే ఎందుకు జాగ్రత్త పడలేదని ఓం రౌత్ పై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే.. జనవరి 12ని తలుచుకుంటూ.. ఆదిపురుష్‌ని ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా అన్నట్టు.. ఆదిపురుష్, ఆడియెన్స్ అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.