AKP: కసింకోట మండలం ఉగ్గినపాలెంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు సీఐ అల్లు స్వామి నాయుడు తెలిపారు. రోడ్డు దాటుతున్న మహిళను ఎలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న వాహనం ఢీకొన్నట్లు తెలిపారు. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. మృతురాలి వయస్సు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందన్నారు. ఈ ఘటనపై పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.