ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి నలుగురు మహిళా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పురుషులతో ధీటుగా రాణిస్తున్నారు. మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, పల్లె సింధూరరెడ్డి సభలో తమదైన శైలిలో గళం వినిపిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. వీరి పనితీరు రాజకీయాల్లోకి రావాలనుకునే ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.