PPM: ఏపీ ఎస్సీ కమీషన్ సబ్యుడు రవాడ సీతారాం శనివారం సాయంత్రం సీతానగరం మండలం మరిపివలస ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధినులకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించి మెనూ అమలు తీరును తెలుసుకున్నారు. స్వయంగా కిచెన్‌ను తనిఖీ చేసి ఆహారాన్ని రుచి చూశారు. పదో తరగతి విద్యార్థుల విద్యా నైపుణ్యాలను పరిశీలించారు.