ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఆదిపురుష్’ టీజర్ గురించే చర్చ జరుగుతోంది. అంతకు ముందున్న భారీ అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది ఈ టీజర్. కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమా పై గట్టి నమ్మకంతో ఉంది. ఇదే విషయాన్ని పలుమార్లు చెబుతు వస్తున్నారు. మీరు ఊహించుకున్నట్టుగా సినిమా ఉండదని.. చిత్ర యూనిట్ ఎంత చెబుతున్నా.. ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.
ఇప్పటికే ఈ టీజర్ పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనాల మనోభావాలు దెబ్బతీసేలా ‘ఆదిపురుష్’ టీజర్ ఉందని పొలిటికల్ సెగ కూడా అంటుకుంది. అయితే దీనిపై దర్శకుడు ఓం రౌత్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తునే ఉన్నారు. తాజాగా మరోసారి స్పందించాడు ఓం రౌత్.
ఈ సినిమా పై తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ‘టీజర్ పై చాలా విమర్శలు వస్తున్నాయి.. ఇందులో కేవలం పాత్రల్ని మాత్రమే పరిచయం చేశాం.. ఒక చిన్న వీడియోను చూసి సినిమాపై ఓ అంచనాకు రావొద్దు.. సినిమా రిలీజ్ అయ్యాక.. ఖచ్చితంగా డిసప్పాయింట్ అవరు.. కావాలంటే నోట్ రాసిస్తా..’ అని అన్నారు.
ఇదిలా ఉండగానే.. ‘ఆదిపురుష్’ రిలీజ్‌పై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైనట్టు తెలుస్తోంది. రాముడిని, హనుమంతుడిని తోలు పట్టీలు ధరించి.. తప్పుగా చూపించారని ఆ పిటిషన్లో పేర్కొన్నట్టు సమాచారం. అలాగే రావణుడ్ని కూడా తప్పుగా చూపించారని పిటిషన్లో పేర్కొన్నారట. దాంతో ఆదిలోనే ఆదిపురుష్‌కు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. మరి అన్నింటిని అధిగమించి ఆదిపురుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందెఓ తెలియాలంటే.. జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.