Pawan Kalyan: పవన్.. ఇది డబ్బు కోసమే చేస్తున్నాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి పాలిటిక్స్ గట్టిగా చేస్తున్నాడు. టీడిపితో పొత్తు పెట్టుకొని ఏపి ఎలక్షన్స్ టార్గెట్ చేస్తున్నాడు. అయితే.. పొలిటికల్‌గా బిజీగా ఉన్న పవన్.. సడెన్‌గా కెమెరా ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకలా?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో.. సెట్స్ పై ఉన్న సినిమాల షూటింగ్స్ అన్ని పక్కన పెట్టేశారు. తిరిగి పవన్ మళ్లీ కెమెరా ముందుకు రావాలంటే.. అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే. ఆఫ్టర్ ఎలక్షన్స్.. ఫస్ట్ ‘ఓజి’ సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు పవన్. ఈ సినిమాకు 20 రోజులకు అటు ఇటుగా డేట్స్ ఇస్తే చాలు.. షూటింగ్ కంప్లీట్ అవనుంది. సెప్టెంబర్ 27న ఓజి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయనున్నాడు. కాబట్టి.. పవన్ మళ్లీ షూటింగ్లో పాల్గొనాలి అంటే.. ఏపీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
కానీ లేటెస్ట్ న్యూస్ మాత్రం వైరల్‌గా మారింది. పవన్ తాజాగా ఓ కమర్షియల్ యాడ్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందుకోసం భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికైతే.. పవన్ సినిమాలు తప్పితే ఎప్పుడు కూడా పెద్దగా యాడ్స్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. ఓ హెల్త్ యాప్‌కి సంబంధించిన యాడ్‌లో నటించేందుకు ఓకే చెప్పారట. ఇందుకోసం రెండు రోజుల కాల్ షీట్స్ కూడా ఇచ్చారట. ఈ రెండు రోజుల కోసం 5 కోట్ల రెమ్యునరేషన్ కూడా తీసుకున్నట్లు ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్.
అయితే.. సడెన్‌గా పవన్ ఈ యాడ్ ఎందుకు చేస్తున్నాడనే డౌట్స్ వినిపిస్తున్నాయి. కానీ.. జనసేన పార్టీని నడిపించాలంటే డబ్బు కావాలి. అందుకే.. ఇలాంటివి తప్పవని అంటున్నారు. పైగా హెల్త్ యాడ్ కాబట్టి.. పవన్‌కు కలిసొచ్చేలా ఉంటుందని ఈ యాడ్‌కు ఒప్పుకున్నట్టుగా సమాచారం.