NTR : కొత్త కారు కొన్న ఎన్టీఆర్.. ధర వింటే షాకవ్వాల్సిందే
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం దేవర షూటింగ్లో యంగ్ టైగర్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
NTR : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం దేవర షూటింగ్లో యంగ్ టైగర్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మిగతా షూటింగ్ పార్ట్‌ను కూడా త్వరలోనే పూర్తి చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. వెంటనే ప్రమోషన్స్ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ఇప్పటివరకు విడుదలైన అన్ని అప్డేట్లు సినిమాకు హైప్ తీసుకువచ్చాయి.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చింది.. ఆ కారు ధర అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. తాజాగా ఎన్టీఆర్ కొత్త కారు కొన్నాడు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఇవాళ ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఎన్టీఆర్ కాలింగ్ గ్లాసెస్ తో బ్లాక్ టీ షర్ట్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కాగా కొత్త కారు రంగు ‘నాటిక్ బ్లూ’ లాగా ఉంది. అద్భుతమైన లుక్‌తో ఉన్న ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే.. మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ ఎస్ 580. ఈ కారు విలువ మార్కెట్లో రూ.2.72 కోట్లు. అయితే ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. అత్యంత ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మరో కారు కొన్నాడు. ఇది విన్న అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. సినిమాల విషయానికొస్తే.. దేవరతో పాటు బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు.