»Ntr And Charan Are Busy Again What About Rajamouli
NTR-Charan : మళ్లీ బిజీ అయినా ఎన్టీఆర్, చరణ్.. మరి రాజమౌళి పరిస్థితేంటి!?
NTR,Charan & Rajamouli : ట్రిపుల్ ఆర్ సినిమా కోసం.. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏకంగా మూడు, నాలుగేళ్ల సమయాన్ని కేటాయించారు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత.. మధ్యలో కరోన కారణంగా చాలా రోజులు డిలే అయింది. ఇక సినిమా రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా సంవత్సరం పాటు ప్రమోషన్స్ చేశారు.
ట్రిపుల్ ఆర్ సినిమా కోసం.. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏకంగా మూడు, నాలుగేళ్ల సమయాన్ని కేటాయించారు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత.. మధ్యలో కరోన కారణంగా చాలా రోజులు డిలే అయింది. ఇక సినిమా రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా సంవత్సరం పాటు ప్రమోషన్స్ చేశారు. రిలీజ్ టైంలో ఇండియా మొత్తం చుట్టేసిన ట్రిపుల్ ఆర్ టీం.. రిలీజ్ తర్వాత అవార్డుల కోసం ప్రపంచాన్ని చుట్టేశారు. మధ్యలో జపాన్‌లో రిలీజ్ చేసినప్పుడు గట్టిగానే ప్రమోషన్స్ చేశారు. ఇక ఆస్కార్ కోసం కొన్ని నెలలు అమెరికాలోనే ఉండిపోయాడు రాజమౌళి. అలాగే ఆస్కార్ ఈవెంట్‌కు మూడు, నాలుగు వారాల ముందే అమెరికాలో వాలిపోయారు. ఎన్టీఆరే కాస్త అమెరికాకు లేట్‌గా వెళ్లారు. ఇక నాటు నాటు ఆస్కార్ కొట్టేసింది.. ఆస్కార్ వేడుకలు అయిపోయాయి.. దాంతో ఇండియా తిరిగొచ్చింది చిత్ర యూనిట్. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా అయిపోయినట్టే. కాకపోతే ఓ బిగ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఈలోపే చరణ్, ఎన్టీఆర్ వర్క్ మూడ్‌లోకి వచ్చేశారు. రీసెంట్‌గానే శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్సీ 15 షూటింగ్లో జాయిన్ అయిపోయాడు చరణ్. ఇక ఎన్టీఆర్ 30కి మార్చి 23న గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నాడు తారక్. ఆ వెంటనే రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇలా చరణ్, తారక్ ఫుల్ బిజీ అయిపోయారు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి పరిస్తితేంటనేది తెలియడం లేదు. నెక్స్ట్ మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే స్క్రిప్టు వర్క్‌తో బిజీగా ఉన్నారు విజయేంద్ర ప్రసాద్. దాంతో ఇప్పుడు రాజమౌళి కూడా స్క్రిప్టు పనుల్లో జాయిన్ అయ్యారా..? లేదంటే కాస్త బ్రేక్ తీసుకొని రంగంలోకి దిగుతాడా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆగష్టులో మాత్రం ఎస్ఎస్ఎంబీ 29 ముహూర్తం ఉంటుదనే టాక్ నడుస్తోంది. మొత్తంగా ట్రిపుల్ ఆర్ టీం మళ్లీ బిజీ అయినట్టే..!