సాధారణంగా సినిమా ఇండస్ట్రీ(Film industry)లో ఉండే సెలబ్రిటీలు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా వ్యాపార రంగాలలో కూడా స్థిరపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలు (Celebrities) వివిధ వ్యాపార రంగాలలో రాణిస్తూ ఉన్నారు.ఇక దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్ నయనతార ఆమె భర్త విఘ్నేశ్ శివన్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.స్కిన్ కేర్ ప్రొడెక్ట్స్ (Skin care products) బిజినెస్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విఘ్నేశ్ శివన్ ఓ ట్వీట్ చేశారు. ‘‘ఆరేళ్ల మా కృషి, ప్రేమను ఈరోజు మీతో పంచుకోవడానికి ఎంతో ఆనందిస్తున్నాం. మా అధికారిక ఖాతా 9SkinOfficialను గర్వంగా, హ్యాపీగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే, సెల్ఫ్ లవ్ ఎంతో ముఖ్యమని మేము నమ్మామని ఆయన అన్నారు
ఈ నెల 29 నుంచి మా జర్నీ మొదలు కానుంది. ఆ రోజు నుంచి స్కిన్ కేర్‌కు సంబంధించిన ప్రొడెక్ట్స్‌ను మీరు మా అధికారిక సైట్లో కొనుగోలు చేయవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. దీనిపై నయన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ‘జవాన్’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నయనతార (Nayanthara). ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఇది భారీ వసూళ్లు రాబడుతోంది. ‘కాతు వక్కుల రెందు కాదల్’ తర్వాత విఘ్నేశ్(Vignesh).. అజిత్‌తో ఓ మూవీ ప్రకటించారు. ఈ సినిమా పట్టాలెక్కక ముందే ఆగిపోయింది. మరోవైపు, సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది తారలు ఇప్పటికే వ్యాపార రంగంలో తమ సత్తా చాటుకుంటున్నారు. నటి రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) కు ఫిట్నెస్ సెంటర్లు ఉండగా.. ‘సాకీ’ అనే బ్రాండ్‌తో దుస్తుల వ్యాపారంలోకి సమంత అడుగుపెట్టారు. శిల్పాశెట్టి(Shilpa Shetty)కి స్కిన్ కేర్ ప్రొడెక్ట్స్, కత్రినాకైఫ్‌కు మేకప్ ప్రొడెక్ట్స్ బిజినెస్‌తో రాణిస్తున్నారు.