»Movie Celebrities At The Rave Party Bigg Boss Stars Caught By The Police
Hyderabad: రేవ్ పార్టీలో సినీ సెలబ్రిటీలు.. తప్పుడు వార్తలంటూ హిమజ క్లారిటీ!
హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి పలువురిని అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ స్టార్లు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతల పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ (Hyderabad) శివార్లలో జరుగున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో పలువురు సినీ సెలబ్రిటీలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇబ్రహీం పట్నం ఫాం హౌస్ వద్ద రేవ్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫామ్ హౌస్‌పై దాడులు నిర్వహించారు. బిగ్‌బాస్ ఫేమ్ హిమజ నేతృత్వంలో ఈ రేవ్ పార్టీ జరిగినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఈ రేవ్ పార్టీ (Rave Party)లో సుమారు 20 మంది వరకూ పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందులో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దొరికిన వారిలో పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు హిమజతో (Himaja) పాటు పలువురు బిగ్‌బాస్ స్టార్లను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో రాజకీయ నేతల పిల్లలు కూడా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
అరెస్ట్ వార్తలపై హిమజ క్లారిటీ.. తప్పుడు ప్రచారం అంటూ వెల్లడి
అరెస్ట్ వార్తలపై నటి హిమజ స్పందించింది. ఇబ్రహీంపట్నంలోని బేబీ వెంచర్లో ఉన్న హిమజ తన సొంత విల్లాలో పూజ చేసినట్లు తెలిపారు. తాను అరెస్ట్ కాలేదని, అరెస్ట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తన నివాసానికి పోలీసులు వచ్చింది వాస్తవమేనని, అయితే వారు వచ్చి తనిఖీ చేసి వెళ్లారని, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం వంటివేమీ చేయలేదన్నారు. దీపావళి సందర్భంగా తన ఇంటికి సన్నిహితులను పిలిచినట్లు చెప్పుకొచ్చారు. పోలీసులు ఇంటికి వచ్చి తన ఇంట్లో ఏం జరుగుతోందోనని ఆరా తీశారని, వాళ్ల డ్యూటీ వాళ్లు చేసుకుని వెళ్లిపోయారని, కానీ మీడియాలో మాత్రం తనపై ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని, అందరికీ వాస్తవం ఏంటో తెలియాలనే తాను లైవ్ లోకి వచ్చి చెబుతున్నానన్నారు.