మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి.. ఏదో ఒక ప్రాబ్లమ్ ఎదురవుతునే ఉంది. ప్రకటించిన తర్వాత పూజా కార్యక్రమానికి కొన్ని నెలలు, ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకొన్ని నెలల సమయం తీసుకుంది. ఇక ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత.. సెకండ్ షెడ్యూల్‌కు మరింత గ్యాప్ వచ్చింది.
ఇలా ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతునే ఉంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందు అన్న రమేశ్ బాబుని కోల్పోయిన మహేష్.. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తల్లి ఇందిరా దేవిని కోల్పోయారు. ఇంకా ఆ బాధనుంచి కోలుకునే లోపే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. దాంతో ఇప్పట్లో ఈ బాధ నుంచి మహేష్ బయటపడడం కష్టమంటున్నారు. ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబీ 28 మహేష్‌కు కలిసిరాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ సినిమా వల్లే మహేష్‌కు బ్యాడ్ టైం నడుస్తుందనే టాక్ కూడా నడుస్తోంది. అంతేకాదు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టే సమయంలో.. హీరోయిన్ పూజా హెగ్దేకు కూడా గాయమైంది. అసలే సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ.. కాబట్టి ఇన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ మధ్య ఎస్ఎస్ఎంబీ 28 ఆగిపోతుందా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి.
పైగా స్క్రిప్టు విషయంలో మహేష్ సంతృప్తిగా లేరనే టాక్ ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అన్ని కుదుటపడిన తర్వాత.. SSMB28 నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కావడం పక్కా అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కు బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పొచ్చు.