Animal: మహేష్ బాబు చేసి ఉంటేనా? ట్రైలర్‌కే పిచ్చెక్కిపోయేది!
యానిమల్.. యానిమల్.. యానిమల్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఇంకా ఈ సినిమా థియేటర్లలోకి రానేలేదు.. కానీ జస్ట్ సాంగ్స్, టీజర్, ట్రైలర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా.
ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా.. లేటెస్ట్గా వచ్చిన యానిమల్ ట్రైలర్ మెంటల్ మాస్ అనేలా ఉంది. మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్స్ కట్ చేసిన ఈ ట్రైలర్ చూస్తే.. సందీప్ రెడ్డి చెప్పినట్టుగా నిజంగానే నిద్ర పట్టడం కష్టంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్రేమ్ టూ ఫ్రేమ్.. మేకింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్టిస్టుల యాక్టింగ్.. ట్రైలర్‌లోని ప్రతి ఎలిమెంట్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. ముఖ్యంగా రణ్‌బీర్ కపూర్‌ని చూస్తే మైండ్ బ్లాంక్ అవడం గ్యారెంటీ. అయితే.. రణ్‌బీర్‌కే ఇలా ఉంటే.. అతని ప్లేస్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉండి ఉంటే.. ఇంకెలా ఉండేదో ఊహించుకోండి.
ఈపాటికే సోషల్ మీడియా తగలబడిపోయి ఉండేది. మహేష్ ఫ్యాన్స్‌కు మెంటల్ ఎక్కి ఉండేది. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు మహేష్ బాబు. వాస్తవానికైతే.. యానిమల్ సినిమాను మహేష్ చేయాల్సింది. తన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలను వదులుకున్న మహేష్ బాబు.. యానిమల్‌ను కూడా అలాగే వదులుకున్నాడని చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత రెండో సినిమాను మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు సందీప్.
మహేష్‌తో సంప్రదింపులు కూడా జరిగాయి. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. ఈలోపు ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో రీమేక్ చేయడం.. ‘కబీర్ సింగ్’ హిట్ అవడం.. అదే జోష్‌లో ‘యానిమల్’ సెట్ అవడం జరిగిపోయాయి. ఇక ఇప్పుడు యానిమల్ ట్రైలర్ చూసిన తర్వాత.. సినిమా సంగతి ఏమో గానీ.. జస్ట్ ట్రైలర్‌కే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయేది. ప్రస్తుతానికైతే యానిమల్ ట్రైలర్ పీక్స్ అనేలా ఉంది.. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 1 వరకు వెయిట్ చేయాల్సిందే.