Vikram: లాస్ట్ మినిట్‌లో షాక్ ఇచ్చిన స్టార్ హీరో!
ఓ స్టార్ హీరో సినిమాకు ఇన్ని కష్టాలా? ఉంటాయా? అంటే, ఉంటాయనే చెప్పాలి. ఎందుకంటే.. ఒకటి కాదు రెండు కాదు గత ఐదేళ్లుగా 'ధృవ నక్షత్రం' సినిమా రిలీజ్‌కు నోచుకోవడం లేదు. తీరా థియేటర్లోకి వస్తుందనుకుంటున్న సమయంలో.. షాక్ ఇచ్చారు.
Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విక్రమ్ సినిమా రిలీజ్ అవుతుందంటే.. తమిళ్, తెలుగు ఆడియెన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ‘ధృవ నక్షత్రం’ విషయంలో మాత్రం.. అసలు ఇది విక్రమ్ సినిమానేనా? అనే డౌట్స్ రాకమానదు. పైగా ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబోలో వస్తున్న సినిమా కష్టాలు చూస్తే.. ఇది కదా సినిమా కష్టాలు అని అనిపించమానదు. విక్రమ్‌తో (Vikram) ఐదారేళ్ల క్రితమే ‘ధృవ నక్షత్రం’ సినిమా మొదలు పెట్టాడు గౌతమ్ మీనన్. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిలే అవుతూ వచ్చింది. ఫైనల్‌గా నవంబర్ 24న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ లాస్ట్ మినిట్‌లో మళ్ళీ ఈ సినిమాను వాయిదా వేశారు. ఇంకొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటున్న సమయంలో.. ఈరోజు సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురాలేక పోతున్నందుకు క్షమించాలి.. అని తెల్లవారుజామున సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు గౌతమ్.
మరో రెండు రోజుల్లో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని.. సినిమాను మీ ముందుకు తీసుకు వస్తామని.. అప్పటివరకు సపోర్ట్ చేస్తారని తెలిపాడు. గౌతమ్ మీనన్ ఆర్థిక కష్టాలే ఇందుకు కారణం అంటున్నారు. అయినా కూడా.. ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందనే నమ్మకం లేదంటున్నారు. ఎందుకంటే.. ఈ సినిమాకు కనీసం ప్రమోషన్స్ కూడా చేయడం లేదు. అయినా.. దాదాపు 5 ఏళ్ల నుంచి విక్రమ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇలా జరగడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. మరి ధృవ నక్షత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.