మాటలతో కాదు హిట్‌తో తనేంటో చూపించాలని.. సైలెంట్‌గా తన పని తాను చేస్తున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తాజాగా డబుల్ ఇస్మార్ట్ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఇస్మార్ట్ కాంబో ఈజ్ బ్యాక్ అని మ్యూజిక్ డైరెక్టర్ పై క్లారిటీ ఇచ్చాడు.
‘Ismart: వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో (Ismat shanker) సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. లైగర్ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో ఇక పూరి పనైపోయిందనే మాట కూడా వినిపించింది. కానీ అక్కడుంది పూరి అనే ఎగిసి పడే అల. ఎన్నిసార్లు కిందకు పడిన.. అంతకు మించిన ఫోర్స్‌తో లేవడం పూరి స్టైల్. అందుకే డబుల్ ఇస్మార్ట్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవడానికి వస్తున్నాడు. ఎలాంటి హడావిడి లేకుంగా సైలెంట్‌గా తన పని చేస్తున్నాడు పూరి. అనౌన్స్మెంట్ రోజే రిలీజ్ డేట్ లాక్ చేసి.. జెట్ స్పీడ్‌లో షూట్ చేస్తున్నాడు.
లేటెస్ట్గా డబుల్ ఇస్మార్ట్.. డబుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత పూరి, చార్మీ మధ్య విభేదాలు వచ్చాయని అన్నారు. డబుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేసి.. అలాంటిదేం లేదు ఈసారి మామూలుగా ఉండదని చెప్పేశారు. ఇస్మార్ట్ శంకర్‌కు మాసివ్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ.. డబుల్ ఇస్మార్ట్‌కు వర్క్ చేస్తున్నాడా? లేదా? అనే డౌట్స్ కూడా ఉండేది. తాజాగా పుకార్లకు చెక్ పెట్టేశారు.
పూరి, మణిశర్మ మ్యూజికల్ కాంబో ఎలా ఉంటుందో చెప్పడానికి.. పోకిరి, చిరుత, ఏక్ నిరంజన్, ఇస్మార్ట్ శంకర్ ఆల్బమ్‌ని చూపిస్తూ.. మరో సెన్సేషనల్ మ్యూజిక్ ఆల్బమ్ రాబోతోందని.. బ్లాక్ బస్టర్ కాంబో ఈజ్ బ్యాక్ అని అనౌన్స్ చేశారు. రామ్, పూరి, చార్మీ, మణిశర్మ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. దీంతో టైటిల్‌కు తగ్గట్టే.. ఈసారి డబుల్ ఇస్మార్ట్ కాంబో ఊరమాస్‌గా ఉంటుందనే చెప్పాలి. అది తెలియాలంటే.. 2024 మార్చి 8 వరకు వెయిట్ చేయాల్సిందే.