Aadikeshava Movie Review:వైష్ణవ్ తేజ కొత్త మూవీ ఆదికేశవ (Aadikeshava). జోడిగా శ్రీలీల నటించింది. వైష్ణవ్ మాస్ హీరోగా.. శ్రీలీల గ్లామర్ రోల్ చేసింది. ఆ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. పదండి.
కథ ఏంటంటే..?
తప్పు చేసిన వారిని శిక్షించే యువకుడు బాలు అలియాస్ బాలకోటయ్య (వైష్ణవ్ తేజ్). బలాదూర్‌గా తిరుగుతుండటంతో తండ్రి (జేపీ) కోప్పడితే జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళతాడు. అతని టాలెంట్ చూసిన యాజమాని చిత్రావతి (శ్రీలీల) ఉద్యోగం ఇస్తోంది. తొలి చూపులోనే లవ్‌లో పడతాడు. అందుకు చిత్రావతి కూడా అంగీకరిస్తోంది. ఆమె పేరంట్స్ మాత్రం ఒప్పుకోరు. అందుకు ఓ కారణం ఉంది. బాలు పేరంట్స్ (రాధిక, జేపీ) నిజమైన పేరంట్స్ కాదని తెలుస్తోంది. దీంతో బాలు గత జీవితం ఏంటీ..? అతని పేరంట్స్ ఎవరు..? బాలును రాధిక దంపతులు ఎందుకు పెంచుతారు.. బాలు అసలు పేరంట్స్ తెలిసిన తర్వాత ఎలా స్పందిస్తారు. తండ్రి చనిపోయాడని తెలిసి వెళ్లిన తర్వాత ఎదురయ్యే సమ్యలు ఏంటీ..? తండ్రికి శత్రువుగా భావించే చెంగారెడ్డికి బాలు ఎలా గుణపాఠం చెప్పాడు..? తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేశాడు..? పెంచిన పేరంట్స్ వద్దకు వచ్చిన బాలుకు తెలిసిన ట్విస్ట్ ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే ఆదికేశవ సినిమా కథ.
ఎలా ఉందంటే..?
లవ్, ఎమోషన్స్, ఫ్యాక్షన్, మాస్, యాక్షన్ అన్ని ఎలివెంట్స్తో ఆదికేశవ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెగ్యులర్, రొటిన్ స్టోరీని కాస్త డిఫరెంట్‌గా ప్రజంట్ చేశాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ శ్రీలీల గ్లామర్, వైష్ణవ్ తేజ్ ఎనర్జీ కనిపిస్తోంది. ఇంటర్వెల్ సీన్లో వచ్చే ట్విస్ట్ మూవీకి హైప్ తీసుకొస్తోంది. సెకండాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కథ వెళుతుంది. క్లైమాక్స్‌లో మాత్రం మితిమీరిన హింస ఉంటుంది. లాజిక్ కనిపించకపోవడం మైనస్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే..?
వైష్ణవ్ తేజ మూవీకి అన్నీ తానై నడిపించారు. కెరీర్లో ఊర మాస్ మూవీగా నిలుస్తోంది. నటనతో శ్రీలీల ఆకట్టుకుంది. గ్లామర్ రోలే కాక నటించి, మెప్పించింది. విలన్ జోజు జార్జ్ క్రూరత్వం తెరపై కనిపిస్తోంది. సుమన్, జేపీ, రాధిక శరత్ కుమార్ పాత్రల పరిధి మేరకు నటించారు. సుదర్శన్ కామెడీ ఆకట్టుకుంది.
సాంకేతిక విభాగాల పనితీరు ఎలా ఉందంటే…
జీవీ ప్రకాశ్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. కొన్ని సీన్లలో బ్రాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డూడ్లే, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫీ మూవీకి రిచ్ నెస్ తీసుకొచ్చింది. ఆర్ట్ విభాగం పనితీరు ఓకే. శ్రీలీల క్యాస్టూమ్స్ బాగున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ వల్ల మూవీ ఎక్కడ బోర్ అనిపించదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
వైష్ణవ్ తేజ్ నటన
శ్రీలీల గ్లామర్
మ్యూజిక్