సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాకుండానే.. ఈ సినిమా పై లేటెస్ట్ న్యూస్ ఒకటి షాకింగ్‌గా మారింది.
మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందా? అని మహేష్ ఫ్యాన్స్‌తో పాటు వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత రాబోతున్న ఈ సినిమాను హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కించబోతున్నాడు జక్కన్న. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ వరకు స్క్రిప్టు లాక్ చేసి.. వచ్చే ఏడాది సమ్మర్లో సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి. ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ లెవల్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ సంస్థలతో చేతులు కలిపాడు జక్కన్న. అయితే ఎస్ఎస్ఎంబీ 29 లేటెస్ట్ అప్డేట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా సినిమాటోగ్రాఫర్‌గా సెంథిల్ కుమార్ ఉండాల్సిందే. కానీ సూపర్ స్టార్ సినిమాకి మాత్రం పిఎస్ వినోద్‌ని సినిమాటోగ్రాఫర్‌గా అనుకుంటున్నారనే న్యూస్ కాస్త షాక్ ఇచ్చేలా ఉంది. ప్రస్తుతం పీఎస్ వినోద్, మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాకు వర్క్ చేస్తున్నారు. అందుకే.. ఇప్పుడు మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్‌కు పిఎస్ వినోద్‌ను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. సెంథిల్, రాజమౌళి సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. సెంథిల్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే మహేష్ ప్రాజెక్ట్‌కు అందుబాటులో లేరనే టాక్ నడుస్తోంది. అయితే.. ఇలా విషయంలో క్లారిటీ రావాలంటే.. వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. మరి రాజమౌళి(Rajamouli) ఈసారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.