Kangana Ranaut: ఎమర్జెన్సీ మూవీ.. కంగనా ఫస్ట్ ఎవరికి చూపించిందో తెలుసా?
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకోగా, ఎఢిటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో మూవీ ఫస్ట్ కాపీని ఆమె ఓ స్పెషల్ పర్సన్ కి చూపించింది. ఆ స్పెషల్ పర్సన్ మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకోగా, ఎఢిటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో మూవీ ఫస్ట్ కాపీని ఆమె ఓ స్పెషల్ పర్సన్ కి చూపించింది. ఆ స్పెషల్ పర్సన్ మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఆయన తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ చాలా సినిమాలకు కథలను అందించారు. ఆయన కథలు అందించిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. విజయేంద్ర ప్రసాద్ కి ఫస్ట్ కాపీ చూపించానని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ మూవీ చూస్తున్న సమయంలో విజయేంద్ర ప్రసాద్ చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నారని ఆమె చెప్పారు. సినిమా మొత్తం చూసిన తర్వాత నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అని తనను ప్రశంసించారని ఆమె చెప్పడం విశేషం. విజయేంద్ర ప్రసాద్ తో కలిసి సినిమా చూస్తున్న ఫోటోని ఫేర్ చేసి ఆమె ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సంఘటనను తాను జీవితంలో మర్చిపోలేనని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎమర్జెన్సీ మూవీకి దర్శకత్వం ఆమె చేశారు. నిర్మాణ బాధ్యతలు కూడా ఆమె చేపట్టారు. నిత్యం కాంట్రవర్సీలతో వార్తలో ఉండే ఆమె, ఈ సినిమాని ఏ యాంగిల్ లో చూపించారా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మణికర్ణిక తర్వాత ఆమె దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది కావడం విశేషం.