బింబిసారతో సాలిడ్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మరో హిట్ కూడా కళ్యాణ్ ఖాతాలో పడేలానే ఉంది. రీసెంట్గా రిలీజ్ చేసిన అమిగోస్ ట్రైలర్.. ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి నెగెటివ్ రోల్. అంతకు ముందు బింబిసారలోను నెగెటివ్ టచ్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు అమిగోస్లోను ఇదే రిపీట్ కాబోతోంది. ట్రైలర్‌తో ఆ విషయం చెప్పకనే చెప్పేశారు. రాక్షసుడు అంటూ ఓ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. సినిమా పాయింట్ కూడా కొత్తగా ఉంది. మామూలుగా సినిమాల్లో ట్విన్స్ మాత్రమే ఒకేలా కనిపిస్తారు. కానీ అమిగోస్లో మాత్రం మనిషిని పోలిన మనుషులు.. డోపల్ గ్యాంగ్ అంటూ.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇదే కాదు.. సంక్రాంతికి వీరసింహారెడ్డిగా వచ్చిన బాలయ్య భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా టైటిల్ లాంచ్ కర్నూలులో జరిగింది. ఇప్పుడు అమిగోస్ ట్రైలర్‌ను కూడా కర్నూలులో రిలీజ్ చేశారు. దీనికి తోడు బింబిసార హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తున్నాడు. ఇదే కాదు.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో హిట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. పైగా బింబిసార లాగే ఈ సినిమాతోను రాజేంద్ర రెడ్డి అనే కొత్త డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇలా ఎటు చూసిన అమిగోస్ సినిమాకు అన్ని హిట్ సెంటిమెంట్సే కనిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడం పక్క అంటున్నారు. ఇక ఆషికా రంగనాథన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.