»Jawan And Skanda Movie Ott Released By November 2nd 2023
Jawan and Skanda: ఒకే రోజు ఓటిటిలోకి వచ్చిన జవాన్, స్కంద!
ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ వారం రెండు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో పాటు.. టాలీవుడ్ హీరో రామ్ నటించిన స్కంద సినిమా ఓటీటీలోకి వచ్చేశాయి.
Jawan and Skanda movie OTT released by november 2nd 2023
ఒకేరోజు రెండు సినిమాలు ఓటిటిలోకి వచ్చేశాయి. ప్రస్తుతం జవాన్(Jawan), స్కంద(Skanda) ఈ సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘స్కంద’ సినిమా.. సెప్టెంబర్ 28న విడుదలైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది స్కంద. అందుకే..నెల రోజులకే ఓటిటిలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. దీంతో నవంబర్ 2 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది స్కంద.
ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్..బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. పటాన్ సినిమా తర్వాత షారుఖ్‌కు వెయ్యి కోట్లు ఇచ్చిన సినిమాగా నిలిచింది. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా నవంబర్ 2న ఓటిటిలోకి వచ్చేసింది. ఆ రోజు షారుఖ్‌ఖాన్ పుట్టినరోజు సందర్భంగా జవాన్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటీ(OTT) ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వారు ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ వేదికగా జవాన్ స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తంగా.. నార్త్ నుంచి ఒకటి, సౌత్ ఒకటి అన్నట్టుగా..ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రస్తుతం ఓటిటిలో సందడి చేస్తున్నాయి.