భారీ అంచనాల మధ్య వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ బాలీవుడ్‌కు కాస్త ఊరటనిచ్చింది. దాంతో ఇదే జోష్‌లో మరో హై ఓల్టేజ్ మూవీ రాబోతోంది. మాస్ మసాలాగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఆ సినిమా పై కూడా భారీ అంచనాలున్నాయి. అందుకే అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమాను హిందీలో అదే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి హిందీ వెర్షన్‌ని తెరకెక్కిస్తున్నారు. తమిళ్లో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించగా.. హిందీ రీమేక్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా నటించారు. అయితే ఈ సినిమాను హిందీ నేటివిటికి తగ్గట్లుగా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
రీసెంట్గా వచ్చిన ట్రైలర్ చూసి.. ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో విక్రమ్ వేద ట్రైలర్ దుమ్ముదులిపేసింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ మాసివ్ రగ్డ్ లుక్కు ఫిదా అయిపోయారు ఆడియెన్స్. సెప్టెంబర్ 30న ఈ సినిమా రిలీజ్ అవనుంది. ఒకవేళ ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. విక్రమ్ వేదను బాలీవుడ్ బాయ్ కాట్ బ్యాచ్ ఏం చేయలేదని అంటున్నాయి బీ టౌన్ వర్గాలు. తాజాగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అలాగే బ్రహ్మస్ర్తని మించి భారీ స్క్రీన్స్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 100 దేశాల్లో ఏ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు. దాంతో విక్రమ్ వేద సరికొత్త రికార్డు క్రియేట్ చేయనుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.