»How Much Did Mukesh Ambani Give To Ram Charan Who Attended Anants Wedding
Ram Charan: రామ్ చరణ్‌కు అంబానీ ఎంతిచ్చాడు?
బాలీవుడ్ హీరోలకు ఓ అలవాటు ఉంది. ఏదైనా పెళ్లిలు, ఫంక్షన్స్‌కి వెళితే.. వాళ్లకు గట్టిగా సమర్పించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామ్ చరణ్‌కు ముఖేష్ అంబానీ ఎంతిచ్చి ఉంటాడు? అనే చర్చ జరుగుతోంది.
How much did Mukesh Ambani give to Ram Charan who attended Anant's wedding?
Ram Charan: ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఏ రేంజ్లో జరిగాయో సోషల్ మీడియా చెప్పకనే చెప్పేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట రచ్చ లేపుతున్నాయి. ఏకంగా రామ్ చరణ్, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేసింది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలో భాగంగా.. బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్, అమిర్, సల్మాన్ నాటు నాటు పాటకు డాన్స్ చేశారు. అయితే.. చరణ్ కూడా అక్కడే ఉండడంతో ఇడ్లీ, వడ రామ్ చరణ్ అంటూ వేదికపైకి పిలిచాడు షారుఖ్. ఇదే ఈ విషయాన్ని చరణ్ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ నెట్టింట షేర్ చేయడంతో.. మెగా ఫ్యాన్స్ షారుఖ్ పై మండిపడుతున్నారు. కానీ.. తమ హీరో చరణ్‌ను అవమానించలేదని.. ‘వన్ 2 కా 4’ సినిమాలోని డైలాగ్ చెప్పాడంటూ అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు.
చదవండి:Sandeep Reddy: సందీప్ రెడ్డి నయా లుక్ వైరల్.. మరోసారి స్పిరిట్ అప్డేట్!
అంతేకాదు.. గతంలో షారుఖ్ ఖాన్, రామ్ చరణ్ పై పొగడ్తలు కురిపిం వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు షారుఖ్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఖాన్ త్రయం ఏదైనా ఈవెంట్‌కు వెళితే గట్టిగానే వసూళు చేస్తారనే టాక్ ఉంది. ఈ క్రమంలో అంబానీ ఇంట జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటారనే టాక్ నడుస్తోంది. ఎదుకంటే.. హాలీవుడ్ పాప్ సింగర్ రిహాన్నకు 50 కోట్లకు పైగా ఇచ్చారనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి రామ చరణ్‌కు కూడా అంబానీ ఏమైనా ఇచ్చి ఉంటాడా? అనే సందేహాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్ దంపతులకు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లో షారుఖ్, అమీర్, సల్మాన్‌తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు చరణ్. దీని కోసం అంబాని భారీగా సమర్పించుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే.. అది ఖాన్ త్రయానికే గానీ, రామ్ చరణ్ విషయంలో మాత్రం అలాంటిదేమి లేదని అంటున్నారు. చరణ్ ఈ వేడుకల్లో ఇష్ట పూర్వకంగానే పాల్గొన్నాడని టాక్.
చదవండి:Sharwanand: ఒక్కరోజే మూడు సినిమాలు.. శర్వానంద్ తగ్గేదేలే!