Hero Navdeep: నవదీప్‌కు హైకోర్టు షాక్.. పోలీసులు వార్నింగ్!
ఇటీవల డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పరారీలో ఉన్నాడు.. అని పోలీసులు చెప్పడంతో నవదీప్ పేరు మార్మోగిపోయింది. కానీ ఆ నవదీప్ వేరే అని అన్నాడు. దీంతో తాజాగా హైకోర్టు నవదీప్‌కు షాక్ ఇచ్చింది.
టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కొత్త కాదు. గతంలో చాలా సార్లు డ్రగ్స్ వాడుతున్నట్టుగా పలువురు టాలీవుడ్ నటీనటుల పేర్లు బయటికొచ్చాయి. ఇక రీసెంట్గా హీరో నవదీప్ డ్రగ్స్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. డ్రగ్స్ కేసుతో సబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నవదీప్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాడని.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. కానీ తాను ఎక్కడికి పారిపోలేదు.. ఇక్కడే ఉన్నాను.. పోలీసులు చెబుతున్న నవదీప్ వేరే అని చెప్పాడు. అసలు మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు ఏమి సంబంధం లేద.. పోలీసులు ఎందుకు తన పేరు తీసుకు వచ్చారో తెలియడం లేదని, మీడియా సమావేశంలో పోలీసులు తెలిపాడు.
కానీ నవదీప్ ఇంట్లో నార్కోటిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కానీ పోలీసుల దర్యాప్తు కు నవదీప్ స్పందించలేదు. ఈ విషయలో హైకోర్టును ఆశ్రయించాడు నవదీప్. తాజాగా నవదీప్ పిటిషన్ పై హైకోర్టు విచారణ ముగిసింది. 41ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నవదీప్‌పై గతంలో కూడా డ్రగ్స్ కేసులు ఉన్నాయని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అతని తరపు న్యాయవాది సిద్దార్థ్ కోర్ట్‌లో వాదించారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. కానీ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తెలిపారు. అయినా కూడా నవదీప్‌కు షాక్ ఇచ్చింది కోర్టు. మరి హైకోర్టు ఆదేశాలతో పోలీసుల విచారణకు నవదీప్ సహకరిస్తాడో లేదో చూడాలి. అన్నట్టు నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్ వారి వద్ద పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.