Mahesh-Charan: ఒకే ఫ్రేమ్‌లో మహేష్, చరణ్.. బ్యూటీఫుల్ పిక్
ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. ఆ కిక్కే వేరు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు.
సూపర్ స్టార్, మెగా పవర్ స్టార్ ఒకే చోట కనిపిస్తే ఎంత బ్యూటీఫుల్‌గా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క ఫోటో చాలు. మహేష్ బాబు, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాకే ముచ్చటేసేలా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆయన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు అనేకమంది హాజరయ్యారు. అక్కినేని కుటుంబ సభ్యులు, రాజమౌళితో పాటు హీరోలు మహేశ్‌బాబు, రామ్‌చరణ్, రానా, మంచు విష్ణు, నాని తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావుతో తమకు ఉన్న అనుభవాన్ని అనుభూతులను పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, రామ్ చరణ్ కలిసి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ బయటకి వచ్చాయి. ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోగా వారితో పాటుగా మహేష్ భర్య నమ్రత కూడా ఉన్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ నవ్వులు చిందిస్తున్నారు చరణ్, మహేష్. దీంతో ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూసి మురిసిపోతున్నారు అభిమానులు.
పనిలో పనిగా ఇద్దరు కలిసి ఓ సినిమా చేసి.. బాక్సాఫీస్ షేక్ చేసేయండని కామెంట్స్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న చరణ్.. ప్రస్తుతం శంకర్‌తో కలిసి గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘గుంటూరు కారం’ చేస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళితో కలిసి హాలీవుడ్ రేంజ్ మూవి చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్.