ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. లేటెస్ట్గా మహేష్ డబుల్ ధమాకా ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.
Rajamoul: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కమిట్ అయిన కమర్షియల్ యాడ్ షూట్స్ కంప్లీట్ చేసి.. ఎస్ఎస్ఎంబీ 29 పై పూర్తిగా ఫోకస్ చేయనున్నాడు. రాజమౌళి ప్రాజెక్ట్ కోసం రెండు, మూడేళ్లు లాక్ అవనున్నాడు సూపర్ స్టార్. అయితే.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఓపెనింగ్ ఎప్పుడు? అనే విషయంలోనే క్లారిటీ రావడం లేదు. ఉంటే.. ఉగాది కానుకగా చాలా గ్రాండ్‌గా లాంచ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. లేదంటే.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నారట. ప్రస్తుతానికైతే.. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ను హీరోయిన్గా ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అలాగే ఓ స్టార్ హీరోని విలన్‌గా ట్రై చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
అలాగే.. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా మొదటి నుంచి వినిపిస్తునే ఉంది. అయితే.. ఇప్పుడు మహేష్ బాబు డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. మహేష్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి. కానీ, రాజమౌళి టీమ్ నుంచి ఇప్పటివరకూ మహేష్ బాబు పాత్రలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. అయితే.. ఈ సినిమా కోసం మహేష్ బాబుకు సంబంధించిన మొత్తం 8 లుక్స్ రెడీ చేశారట. అందులో ఒకటి రాజమౌళి ఫైనల్ చేయాల్సి ఉందట. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రోజే మహేష్ లుక్ రివీల్ కానుంది. మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.