విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన సరే.. సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. లేటెస్ట్గా విజయ్ దేవరకొండ పెళ్లి రష్మిక మందన్న సందడి చేయనుందనే న్యూస్ ఒకటి బయటికొచ్చింది.
Rashmika Mandanna: గీతా గోవిందం సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మధ్యలో ప్రేమాయాణం సాగుతోందనే చర్చ జరుగుతునే ఉంది. విజయ్ ఇంటికి రష్మిక రావడం, రౌడీ ఫ్యామిలీ వెకేషన్స్‌లో రష్మిక కనిపిస్తునే ఉంటుంది. దీంతో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనేది ఫిల్మ్ నగర్ టాక్. కానీ ఈ ఇద్దరు ఏనాడు కూడా ఓపెన్ అవలేదు. తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతూ వస్తున్నారు. కొందరు మీడియా వాళ్లే తమ పెళ్లి చేయాలనుకుంటున్నట్టుగా కామెంట్స్ చేస్తు వస్తున్నారు. ఎందుకంటే.. ఆ మధ్య ఈ ఇద్దరు పెళ్లికి రెడీ అవుతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లిలో రష్మిక సందడి చేయనుందని తెలుస్తోంది.
పెళ్లి అంటే రియల్ పెళ్లి కాదు.. సినిమా పెళ్లిలో రష్మిక కనిపించనుందట. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేరవకొండ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదిన రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే వచ్చిన టీజర్, రెండు సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఈ సినిమాలో రష్మిక మందన్నా కూడా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన సాంగ్‌లో మృణాల్ ఠాకూర్‌తో పాటు రష్మిక కూడా కనిపిస్తుందట. లేటెస్ట్గా రిలీజ్ ‘కళ్యాణి వచ్చా వచ్చా’ పాటలోనే నేషనల్ క్రష్ మెరవబోతుందట. రష్మిక డాన్స్ కూడా చేస్తుందని అంటున్నారు. అయితే.. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.