»Shankar And Kamal Haasan Starrer Indian 2 Spent 30 Crores For A Song
Indian 2: ఒక్క పాటకు 30 కోట్లు ఏంది సామి?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ అంటేనే సినిమా చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. ముఖ్యంగా.. శంకర్ సినిమాలో పాటలు అదుర్స్ అనేలా ఉంటాయి. అందుకే.. పాటల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటాడు. తాజాగా ఒక్క పాటకు 30 కోట్లు అనే న్యూస్ వైరల్‌గా మారింది.
Shankar and Kamal Haasan starrer Indian 2 spent 30 crores for a song
Indian 2: కమల్ హాసన్(Kamal Haasan), శంకర్(Shankar) కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ఇండియన్ 2. దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. వాస్తవానికైతే.. ఈ సినిమా షూటింగ్‌ను ఎప్పుడో మొదలు పెట్టారు. కానీ కొన్ని కారణాలు వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్ సినిమా మొదలు పెట్టాడు శంకర్. కానీ అనుకోకుండా గేమ్ చేంజర్ షూటింగ్ మధ్యలో ఉండగానే.. ఇండియన్ 2కి షిప్ట్ అయ్యాడు శంకర్. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసిన ఈ సినిమాను ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మే నెలలో ఇండియన్ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
అయితే.. ఇండియన్ 2కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి.. కాస్త షాకింగ్‌గానే ఉంది. మామూలుగానే శంకర్ సినిమాల్లో పాటలు నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటాయి. పాటల కోసమే కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటాడు శంకర్. గేమ్ చేంజర్ సినిమాలో కేవలం పాటల కోసమే 90 కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా టాక్ ఉంది. ఇక ఇప్పుడు ఇండియన్ 2లో ఒక్క పాట కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఒక్క సాంగ్‌కు 30 కోట్లు ఏంది సామి? అని షాక్ అవుతున్నారు నెటిజన్స్. శంకర్ సాంగ్‌కు ఖర్చు పెట్టే బడ్జెట్‌తో ఓ సినిమానే తీయొచ్చు. కానీ అక్కడుంది శంకర్.. అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. కాబట్టి.. నిర్మాతలు కూడా శంకర్ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడానికి వెనుకాడరు. మరి ఇండియన్ 2లో 30 కోట్ల సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.