SSMB29: మహేష్, రాజమౌళి.. అప్పటి వరకు వెయిటింగ్ తప్పదా?
మహేష్ బాబు, రాజమౌళి సినిమా థియేటర్లోకి రావడం కోసం ఏండ్లకేండ్లు వెయిట్ చేయాల్సిందే. కానీ అనౌన్స్మెంట్ కోసం కూడా ఈగర్లీ వెయిటింగ్ తప్పడం లేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనని అంటున్నారు.
SSMB29: ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పటికే కమిట్ అయిన కమర్షియల్ యాడ్ షూట్స్ కంప్లీట్ చేసి.. ఎస్ఎస్ఎంబీ 29 పై పూర్తిగా ఫోకస్ చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. ఎందుకంటే.. రాజమౌళి ప్రాజెక్ట్ కోసం రెండు, మూడేళ్లు లాక్ అవనున్నాడు సూపర్ స్టార్. అయితే.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఓపెనింగ్ ఎప్పుడు? అనే విషయంలోనే క్లారిటీ రావడం లేదు. ఉంటే.. ఉగాది కానుకగా చాలా గ్రాండ్‌గా లాంచ్ అయ్యే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు ఎలాంటి సౌండ్ చేయడం లేదు ఎస్ఎస్ఎంబీ 29. రీసెంట్గా జపాన్‌కి వెళ్లినప్పుడు కూడా.. కేవలం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానని చెప్పాడు జక్కన్న. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో? మహేష్ ఫ్యాన్స్‌కు అర్థం కాకుండా ఉంది.
అయితే.. ఉగాదికి ఈ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ మిస్ అయితే మాత్రం.. మహేష్ బాబు పుట్టిన రోజు వరకు ఆగాల్సిందేనని అంటున్నారు. ఆగస్టు 9న మహేష్ బర్త్ డే ఉంది. అదే రోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతానికైతే.. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబుకు సంబంధించి మొత్తం 8 లుక్స్ రెడీ చేశారట. అందులో ఒకటి రాజమౌళి ఫైనల్ చేయాల్సి ఉందట. ఇక ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ను హీరోయిన్గా ఫైనల్ చేసినట్టు టాక్ ఉంది. అలాగే ఓ స్టార్ హీరోని విలన్‌గా ట్రై చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. రాజమౌళి చెప్పేవరకు ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఇలాంటి ప్రచారం జరుగుతునే ఉంటుంది.