Allu Arjun: ‘డిస్కో స్టార్’గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్?
పుష్ప సినిమా వరకు స్టైలిష్ స్టార్‌గా ఉన్నా అల్లు అర్జున్.. ఇక్కడి నుంచి ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ కాస్త డిస్కో స్టార్‌గా మారబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇంతకీ టైటిల్ అదేనా?
Allu Arjun: పుష్ప2 సినిమాతో ఐకాన్ స్టార్ క్రేజ్ మరింతగా పెరగడం గ్యారెంటీ. పుష్ప సెకండ్ పార్ట్‌ను చాలా గ్రాండ్‌గా, ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఆగష్టు 15ను పుష్ప 2 రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే త్రివిక్రమ్‌తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. అలాగే సందీప్ రెడ్డి వంగతో కూడా ఓ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. సందీప్ సినిమా ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదు గానీ.. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ రేసులోకి దూసుకొచ్చాడు. ఇప్పటికే కథా చర్చలు జరిగినట్టుగా.. ఏప్రిల్ 8న బన్నీ బర్తే డే నాడు అధికారిక ప్రకటన రానున్నట్టుగా ప్రచారంలో ఉంది.
అంతేకాదు.. ఈ సినిమా టైటిల్ కూడా లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ‘డిస్కో స్టార్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ టైటిల్ వెనుక మైఖెల్ జాక్సన్ ఉన్నాడనే మాట కూడా వినిపిస్తోంది. ఈ సినిమా కథ మైఖెల్ జాక్సన్ జీవితాన్ని పోలి ఉంటుందనేది కోలీవుడ్ టాక్. అందుకే.. డిస్కో స్టార్ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇదే నిజమైతే.. డిస్కో స్టార్‌గా బన్నీ సెన్సేషన్‌కు రెడీ అవుతున్నట్టే. తన డాన్సుతో ప్రపంచాన్నే షేక్ చేసిన పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్‌ని టచ్ చేస్తే.. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఓ సంచలనం అవుతుంది. ఇక బన్నీ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ 5 హీరోల డాన్స్ లిస్ట్ తీస్తే.. అందులో బన్నీ కూడా ఉంటాడు. ఏదేమైనా.. బన్నీతో అట్లీ ఎలాంటి కమర్షియల్ సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.