ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఇద్దరు ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించారు. ఆస్కార్ కూడా కొట్టేశారు. గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే.. ఈ ఇద్దరు కథలు మార్చుకుంటున్నట్టే ఉంది వ్యవహారం.
NTR: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు చేస్తున్న సినిమాల పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇద్దరు చాలా గ్యాప్ ఇచ్చారు. దేవర అక్టోబర్ 10న థియేటర్లోకి రానుండగా, గేమ్ చేంజర్ కూడా అదే సమయంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు వార్2 చేస్తున్నాడు. చరణ్ ‘గేమ్ చేంజర్’తో పాటు బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తుండగా.. సుకుమార్‌తో సినిమా చేస్తున్నాడు చరణ్. ఇలా ఇద్దరు కూడా సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. అయితే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తీయ్యగల ఏకైక డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు వెట్రిమారన్. ఇలాంటి దర్శకుడికి.. ఎన్టీఆర్ లాంటి యాక్టర్ కలిస్తే అది అద్భుతమైన ప్రాజెక్ట్ అవుతుందని అనుకున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్‌కి వెట్రిమారన్ కథ కూడా చెప్పాడని, అది తారక్‌కు నచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వెట్రిమారన్, చరణ్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. రీసెంట్గా రామ్ చరణ్‌కు ఓ కల్ట్ సబ్జెక్ట్ వినిపించారట వెట్రిమారన్. చరణ్‌కు కూడా కథ బాగా నచ్చిందని తెలుస్తున్నది. అంటే.. ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నుంచి చరణ్ దగ్గరికి వెళ్లిందా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. గతంలో ఎన్టీఆర్, బుచ్చిబాబు కథను చరణ్ దగ్గరికి పపించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా అలానే జరిగిందా? అనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఎన్టీఆర్, వెట్రిమారన్ ప్రాజెక్ట్ లేనట్టేనా? అసలు చరణ్, వెట్రిమారన్ కాంబినేషన్ వార్తలో నిజమెంత? అనే విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.