»Harihara Veeramallu Time Has Started No One Can Stop It
Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ టైం స్టార్ట్.. ఇక ఎవ్వరు ఆపలేరు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా.. ఇక అటకెక్కినట్టేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు పవన్. దీంతో.. మేకర్స్ షూటింగ్‌కు రెడీ అవుతున్నారు.
Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ముందు థియేటర్లోకి రాబోతున్న సినిమా ఏంటి? అనే చర్చకు దాదాపుగా ఫుల్ స్టాప్ పడినట్టే. ఓజి వెనక్కి వెళ్లి, హరిహర వీరమల్లు ముందుకొచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నప్పటికీ.. నిర్మాత ఏఎం రత్నం కొడుకుతో కలిసి కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే.. క్రిష్ పర్యవేక్షణలోనే మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయబోతున్నట్టుగ సమాచారం. ఇప్పటికే క్రిష్ పూర్తి చేసిన పార్ట్ వరకూ ఎలాంటి పెండింగ్ లేకుండా, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్నికల రిజల్ట్స్ తర్వాత పవన్ వీరమల్లుకే డేట్స్ ఇస్తానని చెప్పడంతో.. షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు మేకర్స్. తాజాగా వీరమల్లు చిత్ర యూనిట్ సమావేశమైన పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అందులో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, నిర్మాత ఏ.ఎం రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, విఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్‌లు ఉన్నారు. ఈ టీమ్ వీరమల్లుని ఎంత స్పీడ్‌గా కంప్లీట్ చేయగలం? అనట్టుగా సీరియస్ డిస్కస్ చేస్తున్నారు. అలాగే తదుపరి షూట్‌కి సంబంధించి లోకేషన్ల గురించి చర్చ జరిగినట్లు వినిపిస్తుంది. ఇప్పటికే ఓ టీమ్ లొకేషన్ల వేటలో ఉందని సమాచారం. అయితే.. దీంతో పాటే ఓజి షూటింగ్‌కు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఓజి షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి అయితే.. సెప్టెంబర్ 27న వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వీరమల్లు మాత్రం డిసెంబర్లో థియేటర్లోకి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు.