ఈ సంక్రాంతికి మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున లాంటి పెద్ద సినిమాలతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా కూడా బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పుడు హనుమాన్ కోసం మాస్ మహారాజా రవితేజ కూడా రంగంలోకి దిగాడు.
Hanuman: ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్స్‌లో ప్రశాంత్ వర్మ రూటే సపరేటు. సరికొత్త కంటెంట్‌తో సినిమాలు చేస్తున్న ప్రశాంత్.. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా ‘హనుమాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడింది. ఫైనల్‌గా సంక్రాంతి బరిలోకి దూసుకొస్తోంది హనుమాన్ సినిమా. జనవరి 12న హనుమాన్ను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి సీజన్లో రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్ ‘సైంధవ్’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయినా కూడా హనుమాన్ తగ్గేదేలే అంటున్నాడు.
రీసెంట్గా రిలీజ్ అయిన హనుమాన్ ట్రైలర్‌కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘గుంటూరు కారం’ కూడా రిలీజ్ అవుతోంది. అయినా కూడా తగ్గేదేలే అంటున్నారు హనుమాన్ మేకర్స్. దీంతో.. చిన్న సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా బజ్ జనరేట్ చేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
హనుమాన్ సినిమాలో ‘కోటి’ అనే పాత్రకు మాస్ మహారాజ రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. గతంలో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. మర్యాద రామన్న సినిమాలో సైకిల్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వగా.. ‘ఆ’ సినిమాలో ఓ మొక్కకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాగే.. శివ కార్తికేయన్ నటించిన డబ్బింగ్ సినిమా మహావీరుడు మూవీకి కూడా వాయిస్ అందించాడు. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాలో కోటిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. మరి హనుమాన్ ఎలా ఉంటుందో చూడాలి.